ఇదా రాజకీయం?: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రాజకీయమంటే
ప్రాంతలను పాలించటమా - ప్రత్యర్ధులను దూషించటమా,
ఆత్మస్తుతి చేసుకోవటమా - పరనిందలకు పాల్పడటమా.

రాజకీయమంటే
ప్రజాసేవ చేయటమా - స్వలాభాలు పొందటమా,
వేదికలెక్కి ఉపన్యసించటమా - రచ్చచేసి నిప్పురగిలించటమా.

రాజకీయమంటే
అభివృద్ధికి పాటుపడటమా - రప్పారప్పా ఆడించటమా,
పరిస్థితులు సరిదిద్దటమా - తొక్కవలవటమా తోలుతీయటమా.

రాజకీయమంటే
వక్రీకరణలను పటాపంచలుచేయటమా - అబద్ధాలుచెప్పటమా,
సన్మానాలు పొందటమా - సత్కారాలు చేయ్యటమా.

రాజకీయమంటే
సమరం సాగించటమా - సంధి చేసుకోవటమా,
సింహాసనం అధిరోహించటమా - ప్రత్యర్ధులపై పగతీర్చుకోవటమా.

రాజకీయమంటే 
కుళ్ళు కుతంత్రాలకు దిగటమా - అవినీతి ఆక్రమాలకు పాల్పడటమా, 
చీకటి వ్యవహారాలు నడపడటమా - కక్కుర్తి కార్యాలు కొనసాగించటమా. 

రాజకీయమంటే
మాయమాటలుచెప్పటమా - మధ్యంపంచిడబ్బులుపెట్టి ఓట్లుకొనటమా,
పక్షాలుమారటమా ముఠాలుకట్టటమా - పెత్తనంచేయటమా.

రాజకీయమంటే
కులమతప్రాంతాలను రెచ్చకొట్టటమా - ప్రజాభిష్టాలను నెరవేర్చటమా, 
సంక్షేమకార్యాలు చేయటమా - ప్రజస్వామ్యాన్ని రక్షించుకోవటమా.


కామెంట్‌లు