జమ్ము కాశ్మీర్! అచ్యుతుని రాజ్యశ్రీ

 వేసవిలో శ్రీనగర్,శీతాకాలంలో జమ్ము రాజధానులుగా ఉన్న ఏకైక రాష్ట్రం జమ్ముకాశ్మీర్. ఉర్దూ కాశ్మీరీ డోగ్రీ ముఖ్య భాషలు.రాష్ట్ర పక్షి  బ్లాక్ నెక్డ్ క్రేన్.కాశ్మీర్ స్టాగ్ జంతువు లోటస్ రాష్ట్ర పువ్వు.క్రీ.పూ. 3వశతాబ్దిలో మౌర్య వంశపాలనలో అశోకుడు పాలించాడు.బౌద్ధ మతంప్రాముఖ్యత మొగలులకాలంలో తుడిచిపెట్టుకుపోయింది. అక్బర్ వల్ల ముస్లింల ప్రాబల్యం పెరిగింది.సిక్కులు విజృంభించారు. 1820లో గులాబ్ సింగ్ జమ్ముకి రాజైనాడు.1846లో జమ్ముకాశ్మీరు ఓకేప్రాంతంగా కల్సి పోయాయి.1947లో పాకిస్తాన్ లోని పస్తూన్ల దాడితో అప్పటి రాజు హరిసింగ్ భారత్ లో తన రాజ్యాన్ని కలిపాడు.భూలోక స్వర్గం అని కాశ్మీర్ కి పేరు.సిటీ ఆఫ్ టెంపుల్స్ అని జమ్ముకి పేరు.శ్రీనగర్ లేక్స్ హౌస్ బోట్స్ కి ప్రసిద్ధి.అమర్నాధ్ వైష్ణోదేవి ప్రముఖ పుణ్య క్షేత్రాలు.జీలం,నీలం,పూంచ్ ముఖ్య నదులు.చీనార్ ప్రముఖ చెట్టు.ఇందిరాగాంధీ ట్యులిప్ పార్క్ ఆసియాలోనే అతి పెద్దది.12ఎకరాల్లో ఓనెలంతా పూలతో కళకళలాడ్తుంది.పింక్ ఎల్లో రెడ్ తోపాటు బ్లాక్ ట్యులిప్ కూడా ఉండటం అద్భుతం కదూ🌹
కామెంట్‌లు