పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో విద్యార్థుల ఫండమెంటల్ లిటరసీ ఎండ్ న్యూమరసీ సామర్ధ్యాలను పరిశీలించే ప్రక్రియ చేపట్టామని వమరవల్లి డైట్ లెక్చరర్ పి.రమణమూర్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ నిర్దేశాలమేరకు అన్ని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకూ
బేస్ లైన్ ఎసెస్ మెంట్ టెస్ట్ లు నిర్వహించుచుండగా, సంతవురిటి మండల పరిధిలో తమ బృందసభ్యులు ఈ పాఠశాలలను సందర్శించుచున్నామని ఆయన తెలిపారు. మండల విద్యాశాఖాధికారులు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావులతో పాటు క్లస్టర్ ఛైర్మన్ ల సహకారంతో, సి.ఆర్.ఎం.టి.లు, వమరవల్లి డైట్ విద్యార్ధిణి కేతుబారికి రేణుక, స్థానిక సచివాలయాల విద్యా సంక్షేమ కార్యదర్శులు టీమ్ సభ్యులుగా ఈ పర్యటనలు జరుగుచున్నాయని రమణమూర్తి తెలిపారు. ఒకటోతరగతి నుంచి ఐదోతరగతి వరకూ తెలుగు, ఆంగ్లం, గణితం విషయాలపై ఈ పరీక్షలను నిర్వహించారు. తెలుగు ఇంగ్లీష్ లలో అక్షరాలు పదాలు వాక్యాలు పేరాలను, గణితంలో సంఖ్యాభావన, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలు విద్యార్థులలో ఏమేరకు సామర్ధ్యాలను కలిగియున్నారో పరిశీలించడం జరిగింది. పరీక్షల అనంతరం తగు ఫలితాలను నమోదు చేసామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి, ఉపాధ్యాయులు ఎన్.లక్ష్మణరావు, కుదమ తిరుమలరావు, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి