బతుకమ్మ పండుగ వచ్చింది
అడవికి మేము వెళ్ళాము
గునుగు పూలను తెంపాను
సంచులన్ని నింపాము
ఇంటికి తీసుకు వచ్చాము
అమ్మా సిబ్బి తెచ్చింది.
గుమ్మడి ఆకులు పరిచాము
గునుగు కట్టలు కట్టాము
చుట్టూ చక్కగా పేర్చాము
రకరకాల పూలను తెచ్చి
మధ్యమధ్యన పేర్చాము
గౌరమ్మ మధ్యలో నిలిపాము
దేవుని దగ్గర పెట్టాము
మలీద ముద్దలు చేశాము
సాయంత్రం అయింది
బతుకమ్మనుతీసుకువెళ్ళాము
ఊరి మధ్యలో పెట్టాము
చక్కని పాటలు పాడాము
సాయంత్రం అయింది
చేరువులోనా వేశాము
వాయినాలు పంచాము
మలీద ముద్దలు తిన్నాము
ఇంటికి తిరిగి వచ్చాము
చిన్నలు పెద్దలు కలిశాము
బతుకమ్మ ఆటలు ఆడాము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి