సామెత -70: అధముడికి ఆలయ్యే కంటే- బలవంతునికి బానిసయ్యేది మేలు
****
"ఏం కాలమో ఏమో? ఆడపోర్లు సుత అద్దు పద్దు లేకుండయ్యిండ్రు. కన్నోళ్ళ కండ్లల్ల కారం గొట్టి కానోని వలల శిక్కుకుంటుండ్రు.గాళ్ళ మాయమాటలు నమ్మి మంచోళ్ళని బ్రముస్తుండ్రు.ఆడు ఏసుకొచ్చే డుగ్ డుగ్ మోటరుబండినీ,ఆడి శేతిలుండే యాప్లీస్ కాయ పోనును జూసి గాళ్ళకేం తక్వ లేదని నమ్మి గాల్లెంట బడుతుండ్రు. గాళ్ళ అసల్రూపం నిండ మున్గినంక తెలిసి ఏం జెయ్యలేక ఆగమై బోతుండ్రు.
గింతకీ ఎవలే అవ్వ గా పొల్లగాండ్లు?
పొల్లగాండ్లు గాదురా! ఎన్క బజాట్లె పతాపన్న లేడు .గాయన్న బిడ్డ సంగతి. గా పొల్ల నీకు సుత తెల్సుగద! పరికిణా వోణీ ఏస్కోని బుట్ట బొమ్మోలె ఉండేది. గా పోల్ల గురించే చెప్పేది.
"పాపం!పతాపన్న రంది రంది గాదుపో! ఎప్పుడూ గలగలమని మాట్లాడుకుంట,నల్గురితో సర్దాగ ఉండేటోడు.గా పొల్ల జేసిన పనికి తల్కాయ ఎత్తుకోలేక బోతుండు.అన్న ఆదర్శాలన్నీ మట్టిగొట్క పోయినయి.పెంపకంల లోపమెక్కడుందాని ఇశారం శేత్తున్నడు.
"ఇంగ రంధెందుకు అవ్వా! మావ ఆదర్శం లెక్కనే దాని దారి అది సూస్కుంది గద!"
"తవ్వలోనె ఉంది కువ్వారం అన్నట్టు"గక్కడే ఉందిరా అసలు మెలికె. శేస్కుంటే శేస్కుంది. ఏడైతేంది సుకంగుంటే గింత రంది ఉండ్కనే పొవ్వు.
మరి గా పొల్ల ఏం జేసిందో తెల్సా? సదువూ సందె,సంస్కారం,పద్దతి గిద్దతి ఏం లేని ఎవడో అధమున్ని జేస్కుంది. ఇంగ గాడికి లేని అలవాటు లేదు. గా దుట్టుడు "పొల్లని అదిలిచ్చే జేస్కుండో.. బెద్రిచ్చే జేస్కుండో గని గానంత అవులే గాడు ఇంకోడు లేడు."
"అయ్యయ్యో! అవ్వా! గట్లనా ?పొల్ల బత్కు ఆగమైంది గద!"
"అవున్రా?"అధముడికి ఆలయ్యే కన్న-బలవంతునికి బానిసయ్యేది మేలు" అని పెద్దోళ్ళు ఊకెనే అన్లే!
సుఖంగ బత్కిన పొల్లాయె.గిప్పుడు కన్నమ్మ కట్టాలు పడ్తుందట.గదాని గురించే గీ ఇశారమంత!గియన్ని అన్న జెప్పిన కానించి నాకు సూత మన్సుల మన్సు లేదు. గిట్ల ఆడపొల్లగాండ్ల బతుకు ఏమైతుందీ.
" నిజమే గని అవ్వా!గా పొల్ల అంతగనం కట్టబడ్తుంటే మరి పతాపు మావ సూస్కుంట ఏం జేత్తుండు?వాళ్ళిద్దర్నీ దీస్కొచ్చి ఇంట్లె ఉంచుకోవచ్చు కదనే!"
"అవును గని" తిన మరిగినోడు ఇంగ జీవితంల కట్టబట్టానికి ముందు కొత్తడా!ఇంగ పొల్లకి సుత దెల్వాలె కట్ట సుఖాలు" గందుకే పైస ఇయ్యదల్సుకోలేదు."
అవున్లే అవ్వా! సుబూదైన మాటన్నవ్! ఇంగ నేనెల్లి పక్క వాల్సుకుంట అన్కుంట అవ్వ కొడుకు మన్సాలకు పోయిండు.
గదండీ సంగతి!అధముడికి ఆలయ్యే కంటే బలవంతునికి బానిసయ్యేది మేలు" అంటే గిదే!గిక్కడ బలవంతుడి దగ్గర బానిస అయ్యే కంటే అయిశతు ఉన్నోడి కాడ శిన్నదో పెద్దదో ఉజ్జోగం శెయ్యడం మంచి మంచిది అని అర్తము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి