అడవుల్లో వర్షం కురిస్తే ఎడారుల్లో గొడుగు పట్టినట్లు
నమ్ముకుంటే నదినే కానీ ఏటిని నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తుందో తెలియదు.
ఎండిన మొద్దయిన చిగురుస్తుంది మండే కర్రను నిప్పు కాలుస్తుంది.
నిండుకుండ నిలకడగానే ఉంటుంది
జెండా జాడ నింగిన నే కానీ నేలను తాకదు కదా!!
ఎగిరేది ఏదైనా పక్షిగా మారాల్సిందే
పరుగెత్తేది ఏదైనా చిరుత చిరునామా కావాల్సిందే
కొండల్లో అరిస్తే లోయల్లో కాదు గుండెల్లో గుబులు పుడుతుంది.
మంత్రాలతోనే మాటలు పుడతాయి తంత్రాలతోనే కుతంత్రం బయటపడుతుంది.
జలం జ్వాలను ఆర్పితే జ్వాలా జలాన్ని ఆవిరి చేస్తే అది దాని బలం కాదు స్వభావం!!.
వేళ్ళతో ఏలేది కళ్ళతో కాల్చేది తలరాతలు మార్చేది
గీతలు కాదు అరచేతిలో నీ యంత్రం.
కాలే కడుపు ఖాళీ మెదడు కొండలను ఢీకొనదు కండబలం చూపదు గుండెలను గెలుచుకొనదు.
జలపాతాలన్నీ శ్వేత కపోతాలై ఆకాశంలో ఎగురుతున్నవి.
రక్తం ఇప్పుడు రంగును మార్చుకొని మారువేషన్లో తిరుగుతుంది.
శ్వాస ఒంటినిండా ఉంది కంటి నిండా కదులుతుంది
మేఘం ఆదర్శమే ఈ వర్షం
రెప్పలు లేకుండా చూపులు ఆపలేం మనం.!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి