ఫ్లైఓవర్.:-డా.సి వసుంధర,-చెన్నై.
 జీవన యానంలో 
 ఎన్నో కష్టనష్టాల
పిల్ల కాలవలు, నదులు, క్లిష్టమైన 
దారులు.
వాటి నెలాదాటడం? వం తేనొక్కటే సాధనం

మనిషి ప్రకృతిని జయిస్తాడు. జయించాడు. దానికి సాక్ష్యమే  వంతెన.
బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఎదురయ్యే సమస్యల, కష్టాల
కడలి  దాటే నేర్పు కు మారుపేరే వంతెన.

 ఆనాటి
 వానరులు సీతారాములోరి 
కోసం కట్టిన వంతెననుండి,
నేటి కాశ్మీర్ లో కట్టిన సుప్రసిద్ధ వంతెన వరకు 
మనిషి జీవిత  గమనానికి మార్గదర్శకమే వంతెన.

మాటల్లో చేతల్లో భాందవ్యాలలో
 స్ఫూర్తినిచ్చే సమయస్ఫూర్తి,
సద్భావన సరసత్వం ఇవన్నీ
మనల్ని మరో ఆవలిగట్టుకు చేర్చే వంతెనలు.
 వీటినిర్మాణం గట్టిపరచుకొంటే మనప్రయాణం 
సులభం.సుగమం.
 వంతెన లేనిరోజు 
జరగదు ముందుకు లోకం.
దాని ప్రాముఖ్యత ఎరుగని వ్యక్తికి గడవదు హాయిగా జీవితం.
రెండు చివర్లను కలిపేది వంతెన. 
రెండు సమస్యల పరిష్కారం పేరే వంతెన.

కామెంట్‌లు