సహనం!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
ప్రతిభ లేక కాదు 
సమయం లేక కాదు 
సహనం లేక 
ఏదీ సాధించలేం!!?

సహనం ఉంటే 
సాధించాల్సిన అవసరం లేదు.!!

ప్రతిభ లేక 
సమయం లేక 
సహనం లేక 
పురుషులు వెనుక బడతారు.

సహనంతో స్త్రీ 
ప్రపంచాన్ని జయిస్తుంది.!

ప్రతిభ సమయం లేకున్నా 
సహనం 
వ్యాపారానికి ముఖ్యం. 

ప్రతిభ సమయం లేకున్నా 
సహనం 
రాజకీయాలకు ముఖ్యం. 

ప్రతిభ సమయం లేకున్నా 
సహనం 
సంపాదనకు ముఖ్యం.!!

సహనం లేక ఏదీ సాధించలేం 
సహనం ఉంటే 
సాధించాల్సిన అవసరమే లేదు.!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు