మందుగుండు! :- అచ్యుతుని రాజ్యశ్రీ

 కొత్త సంవత్సరం అర్ధరాత్రి టపటపా టపాసుల మోత! ఆటలో గెలిస్తే,పెళ్లి దేవుని ఊరేగింపులో, ఇక దీపావళికి రకరకాల పటాకులు ఢమఢమలు తప్పవు.మరి మందుగుండుసామగ్రికి కావల్సినవి బొగ్గు గంధకం పొటాషియం నైట్రేట్ కావాలి.అసలు వీటిని ఎలా కనుగొన్నారు? 9వశతాబ్దంలో చైనాలో ఓప్రాంతంలో సైనికులు కొండలోనుంచి పసుపుపచ్చ మట్టిని తవ్వి రాజుగారి తోట లో పోశారు.అక్కడ బొగ్గుపొడి ఉంది. ఆమర్నాడు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి అక్కడ ఉన్న చెట్లుచేమలన్నీ మాడిమసైనాయి. 13వ శతాబ్దందాకా చైనావారి దృష్టి పేలుడుపదార్ధాలపై పడలేదుకానీ యూరప్ వారు పరిశోధనలు చేశారు.టపాసులను కనుగొన్నది రోజర్ బేకన్ అనే చెప్పొచ్చు.పొటాషియం నైట్రేట్ గంధకం చార్కోల్  అంటే బొగ్గు మిశ్రమంతో మందుగుండు సామగ్రిని తయారుచేస్తారు.ఈమూడు కల్సి మండటంతో వేడి గ్యాస్ ఉత్పన్నమై చప్పుడు చేస్తూ హడలకొడ్తాయి. మనదేశంలోకి మొగల్స్ మందుగుండు సామానుతో వచ్చి దేశాన్ని కొల్లగొట్టి ఆక్రమించారు🌹
కామెంట్‌లు