క్రీస్తంటే..? క్రిస్మస్ పండుగంటే..?: కవిరత్న-సాహిత్య ధీర-సహస్త్రకవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ప్రేమే యేసుకు ప్రాణవాయువు...
కరుణే అభిషిక్తునికి అలంకారం...
జాలి...దయ...క్షమ...త్యాగగుణాలే
ఆ దయాసాగరునికి ధగధగ మెరిసే
దవళవర్ణ వస్త్రాలు...వజ్రకిరీటాలు...

సత్యమే ఆయన నిత్య నినాదం
పాపాంధకారంలో దారి తప్పిన
గాయపడిన గొర్రెపిల్లలను వెతికి
భుజాలపై మోసి కాపాడి రక్షించే
కరుణాసాగరుడు త్యాగధనుడు...

పాపక్షమాపణకై పరితపించే
విరిగి నలిగిన హృదయాలను
తన అమృతహస్తంతో ఓదార్చి
మలినమైపోయిన మనసుల్ని
పవిత్ర జలధారలతో శుద్ధిచేసే 
పరమపావనుడు ప్రభువైన క్రీస్తు...

అభిషిక్తుని బోధ ఓ అమృతధార
మరణాన్ని దహించే మంత్రదండం
అది శాంతిమయం కాంతిమయం...
ఆశ్రయించిన భక్తుల వ్యాధులు
బాధలు భయాలన్నీ మటుమాయం...

మృత్యుంజయుడైన క్రీస్తుండగా
భయమేల దండగ ఈ క్రిస్మస్ పండుగ
పాపుల్ని పరిశుద్ధులుగా మార్చేపండుగ
క్షమకు కరుణకు కారుణ్యానికి చిరునామా



కామెంట్‌లు