ఆ సమయంలో శనీశ్వరుడిని ఆమడదూరంలో ఉంచడానికి ఉన్న ఏకైక మార్గం... "ఆంజనేయుడిని ఆరాధించడం"
ఒకరోజు, ఆంజనేయుడిని పట్టుకోవడానికి శనిదేవుడు వచ్చాడు.
ఆంజనేయుడు ప్రతి రోజూ తోటలో వికసించిన పువ్వులను కోసి, రాముడిని పూజించి, పాటలు పాడేవాడు. ఆ సమయంలో తనను తాను మరచిపోయేవాడు.
ఎప్పట్లాగే ఆ రోజూ తోటకొస్తున్న ఆంజనేయుడు, తనను పట్టుకుని ఇబ్బంది పెట్టడానికి ప్రవేశ ద్వారం వద్ద శనిదేవుడు వేచి ఉన్నాడని గ్రహించాడు.
మరోవైపు శనిదేవుడేమో తన విధిని నిర్వర్తించడానికి వచ్చాడు.
శనీశ్వరుడు తన పని తాను చేసుకోనీ.... నేను నా నిత్య కార్యాన్ని నిర్వర్తిస్తానని ఆంజనేయుడు మనసులో అనుకున్నాడు. రాజభవనం నుండి బయలుదేరేటప్పుడు, అతను తన తోక కొనను మాత్రమే చాచాడు.
బయట వేచి ఉన్న శనిదేవుడు ఆంజనేయుడి తోకను చూడటంతోనే దానిపైకెక్కి గట్టిగా పట్టుకున్నాడు.
విషయం గ్రహించిన ఆంజనేయుడు శనిదేవుడిని ఎలా తరిమికొట్టాలో కొంతసేపు ఆలోచించాడు. ఆంజనేయుడు కారణంతోనే
రాముడిని తనకు తోచిన రీతిలో నర్తిస్తూ పూజించాలని నిర్ణయించుకున్నాడు. అలానే చేయనారంభించాడు. దీంతో తోక చివర ఉన్న శనిదేవుడికి నొప్పి కలిగింది.
ఆంజనేయుడు దూకడం మానేస్తాడా అని ఆలోచిస్తూ, శనిదేవుడు చాలా బాధపడ్డాడు.
నొప్పి భరించలేకపోయిన శనీశ్వరుడు ఆంజనేయుడిని "నువ్వు ఎప్పుడు దూకడం మానేస్తావు? " అని అడిగాడు.
అప్పుడు ఆంజనేయుడు "శనీశ్వరా!
నేను ఏడున్నర సంవత్సరాలు ఇలానే నర్తిస్తాను...." అని చెప్పాడు.
ఆ మాటకు శనిదేవుడు భయ పడ్డాడు. అమ్మో అంత కాలమా అని అనుకున్న శని భగవానుడు ఆంజనేయుడి తోక ఎందుకు పట్టుకున్నానా అని లోలోపల అనుకుంటాడు. ఆంజనేయుడిని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు శనీశ్వరుడు. ఆంజనేయుడికి ఆ మాటే చెప్పి శని వెళ్ళిపోతుండగా ఆంజనేయుడు సంతోషించి శనిదేవుడితో ఇలా అన్నాడు...
"శని దేవా! నన్ను విడిచిపెట్టినట్లే, నువ్వు ఏడున్నర సంవత్సరాలు పట్టుకున్న వారినీ విడిచిపెట్టాలి...నన్నారాధించే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు" అని విన్నవించాడు.
అందుకు శని దేవుడు అంగీకరిం చాడు.
కాబట్టి మన దుఃఖాలను పోగొట్టుకోవడానికి ఆంజనేయుడిని పూజించాలి. అలా చేస్తే ఆంజనేయుడి భక్తులను శని దేవుడు ఇబ్బంది పెట్టడు.
కనుక ఏలినాటి శని, అష్టమి శని అప్పుడు బాధలు తొలగిపోవడానికి రామదూత ఆంజనేయుడిని పూజిద్దాం. ప్రార్థిద్దాం. తరిద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి