పాలఖండ్యాంలో ఘనంగా వీర్ బాల దివాస్

 కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశాలతో, మండల విద్యాశాఖాధికారులు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావుల సూచనల మేరకు పాఠశాల విద్యార్థులకు ఐ.ఎఫ్.పి. స్క్రీన్ పై వీర్ బాల దివాస్ కార్యక్రమాన్ని వీక్షింపజేసామని ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, యందువ వెంకటరమణ, ముల్లు సుజాతలు తెలిపారు. సిక్కు మత పదో గురువు చివరి గురువు ఐన గురుగోవింద్ సింగ్ జీ నలుగురు కుమారుల వీర మరణానికి నివాళిగా ఈ కార్యక్రమం ఉద్దేశించబడిందని వారన్నారు. చమ కౌర్ యుద్ధాన వీరోచితంగా పోరాడిన తొలి ఇద్దరు కుమారులు వీర మరణం చెందగా ఆ ఇరువురి దేశభక్తిని విద్యార్థులకు ఈ కార్యక్రమం అవగాహన కలిగిందని అన్నారు. ఇస్లాం మతం స్వీకరించేందుకు నిరాకరించిన చివరి ఇద్దరు కుమారులను మొఘల్ గవర్నర్ నిర్దాక్షిణ్యమైన ఆదేశాలతో, గోడలో సజీవ సమాధి గావించబడుట ఎంతో బాధాకరమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వారి త్యాగాలను ధర్మం కోసం నిలిపేలా స్పూర్తినిచ్చాయని తెలిపే పలు అంశాలను తిలకించామని వారన్నారు. వందేమాతరం పూర్తి గేయాన్ని, బాలల వీర గాథల రూపకాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు రెండు గంటల పాటు విద్యార్థులంతా వీక్షించడం జరిగిందని ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, యందువ వెంకటరమణ, ముల్లు సుజాతలు తెలిపారు.
కామెంట్‌లు