వన పర్వము తృతీయాశ్వాసము- * 89వ రోజు
భాగీరధుడు
రోమశుని మాటలు విని ధర్మరాజు " మహర్షీ ! భగీరధుడు సముద్రాన్ని జలంతో ఎలా నింపాడు? " అని అడిగాడు. రోమశుడు ధర్మరాజుతో " ధర్మజా! పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉన్నాడు. అతనికి వైదర్బి, శైబ్య అనే ఇద్దరు భార్యలు. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. సగరుడు సంతానం కావాలని శివుని కోరాడు. శివుడు అలాగే వరమిచ్చాడు. సగరుని భార్యలు ఇద్దరు గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక అలబూఫలం (ఆనపకాయ) పుట్టింది. శైబ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి " రాజా ఆ కాయలోని విత్తనాలు నేతికుండలలో పెట్టి కాపాడితే నీకు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు " అని పలికింది. సగరునికి అరవై వేల మంది కుమారులు జన్మించారు. సగరుని కుమారులు లోక కంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను బాధిస్తున్నారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతలతో " వారి గర్వం ఎక్కువ కాలం ఉండదు. త్వరలోనే వారు చనిపోతారు " అని చెప్పాడు.
సగరుని అశ్వమేధయాగ సంకల్పం
తప్పిపోయిన యాగాశ్వాన్ని కపిలుని ఆశ్రమ సమీపాన చూసిన సగర కుమారులు
సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కుమారులకు ఇచ్చాడు. యాగాశ్వం నీళ్ళు లేని సముద్రంలోకి వెళ్ళి మాయమైంది. సగరుడి కొడుకులు యాగాశ్వాన్ని వెదుకుతూ సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్యంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడని సగరకుమారులు అతడిని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నితో సగరకుమారులను భస్మంచేసాడు. నారదుని వలన ఆ విషయం సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి అసమంజసునికి జనించి పెరిగి పెద్దవాడైన అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. సగరుడు అంశుమంతుని చూసి " నాయనా! నాకుమారులు చనిపోయినందుకు నేను భాధపడను కానీ అశ్వమేధయాగం సగంలో ఆగిపోయింది దానిని నీవు పూర్తి చెయ్యి " అని కోరాడు. అలాగే అని అంశుమంతుడు కపిలమహామునిని చూసి నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. కపిల మహాముని " అంశుమంతా! ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధయాగం పూర్తి చేస్తాడు. నీ మనుమడు భగీరధుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చి సాగరాన్ని జలంతో నింపుతాడు " అని చెప్పాడు. అలాగే సగరుడు అశ్వమేధం పూర్తిచేసాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అందుకే సముద్రానికి సాగరం అనేపేరు వచ్చింది.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి