సామెత -84: అడ్డెడడ్ల ఆశకి పోతే -తూమెడొడ్లు దుడ్డె బుక్కి పాయె
*****
"నీయవ్వ! వొద్దురా! అరె వొద్దురా! గస్మంటియి మనకచ్చిరావురా! అంటే ఇన్నడా?పైంగ నేను బాగుపడ్తనంటె నువ్వోర్త లేవు. గందుకే దోస్త్ పేర్తో ముందలి కాళ్ళకి బందమేత్తున్నవ్! నీకు చెప్పడమే బుద్ధి తక్వ అంటడా? ఇప్పుడు జూడు అగోరిత్తుండు.నడి సంద్రంల మునుక్కుంట ఎవలన్నొచ్చి కాపాడ్తరాని ఎద్రు సూత్తుండు. పోగొట్టుకుంది వందలో, ఏలో అయితే సోపతి గాళ్ళంద్రం కూడి తలాయింత ఏస్కుని ఒడ్డున పడేద్దుం. గాడు లచ్చలు లచ్చలు పోగొట్టుకుండు.గవన్ని ఎట్ల బూడ్తయి.ఒకటి గాదు రొండు గాదు ఏడు జల్మలెత్తినా పూడ్సుకోలేడు."
"తల్సుకుంటె నాకే శెక్కరొచ్చినట్లయితంది.ఇంగ గాడికెట్ల ఉండాలె.ఎట్టాగో అట్ట తీరుద్దామంటె సన్న సిన్న అప్పుగాదే!"
"ఏందిరా అయ్యా?ఎవలో బాయిల్నో,ఋ సంద్రంల్నో పడ్డడంటన్నౌ? ఒకటే ఇశారిత్తున్నవ్? గంత గనం రంది జేత్తున్నవౌ? ఇంతకీ గాళ్ళు ఎవలో శెప్పు.?
"తల్లి మాటల్కి" అవ్వా! మా దోత్తు హనుమంతు గాడు నీకు సుత దెల్సుకదవ్వా! గాడు అంతో ఇంతో ఉన్నోడే. అయ్య పంచిచ్చిన పొలం,శెల్క ఉంది.మంచి పంట పండుద్ది. బువ్వకు బట్టకు కొద్వ లేకుంట అవల్ దర్జాగా బత్కుతున్నడు."
"గాడు గీ మధ్య సెల్లులో ఏదో డబ్బు సంపాదించే యాపేదో ఉంటే గది డౌన్ లోడ్ సేశుకుండంట.గందులో ఓ త్యేప పదేలు గట్టమంటె కట్టిండంట.దానికి నెల తిరక్క ముందే వెయ్యి కల్పి ఎకవుంట్ల ఏసిండ్రంట. గవి జూసి సంబుపడుకుంట ఎవ్వలికి చెప్పకుండ పొలం తాకట్టు బెట్టి డబ్బులు గట్టిండంట. ఇంకేముంది!ఎన్ని సార్ల ఎకౌంటు జూసినా పైసలన్ని తీశినట్టు ఉందట. "
లబలబలాడ్కుంట నా తానకొచ్చి సూపిండు. పేదోడు ఆశపడ్డడంటే ఏదోలే అన్కుంటం.గిప్పుడు సూడు ఏమయ్యిందో... అత్యాశకి బోతే.."
గదేలేరా "అడ్డెడడ్ల ఆశకి పోతే -తూమెడొడ్లు దుడ్డె బుక్కి పాయె "అన్నట్టుందేరా నాయినా !"
"ఒయ్! భలే గుంది.అవ్వోయ్! అడ్డెడు అంటే ఎంత?" అడ్గనే అడ్గిండు బుడ్డోడు.
గివి ఎన్కటి కొల్తలురా! అడ్డెడు అంటే రొండు మానికలు,గిప్పటి లెక్కకి అటిటుగా రొండు కేజీలు అన్కో.. గట్లనే తూమెడు అంటే అటిటుగా ఎన్మిది నుంచి పది కేజీలు అన్కో.
"వామ్మో! పది రూపాయల కోసం వొంద రూపాయిలు పోగొట్టుకున్నట్టు ఉంది." భూలచ్మి అంటుంటే" నీకు బలేగ లెక్కలొత్తున్నయ్ మన్వడా "బేశ్! అన్కుంట మెచ్చుకుంది అవ్వ!
గట్లాంటి అత్తేశ ఉన్నోడికి గిట్లనే అయితుంటది.అత్తేశకి పోగూడదు అంటున్న అవ్వ మాటల్కి అవునవ్వా! అని పిల్లలతో గొంతు కలిపిండు అవ్వ కొడుకు.
గదండీ సంగతి. వున్న దాంతో తుప్తి పడక పోతే గిట్లనే జరుగుద్ది.మీరు సుత నా మాటకి వంత పల్కుతరు గదూ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి