గీతాకృష్ణ:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 గీత చదివి
రాత మార్చుకో
కీలెరిగి వాత పెట్టుట
అభ్యాసం చేసుకో
జీవిత సమరంలో
పయనించుట నేర్చుకో
కర్మలన్నీ కడకు
ఫలితమొందు నిజం తెలుసుకో
నీ పని నీవు 
చేయక తప్పదని గ్రహించుకో
జ్ఞానం నీ మార్గాన్ని
నిర్దేశిస్తుందని రాసుకో
చివరకు మిగిలేది
చింతనేనని తీర్మానించుకో
చదరంగమే బతుకుబాటని
శాసనం చేసేసుకో
జన్మభూమి కన్నా గొప్పది
లేనేలేదని నిర్ణయించుకో
నీవొక సాధనం మాత్రమేనని
విషయం విశదపరుచుకో
శాశ్వతమైనది దైవమేనని
తెలివి పెంచుకో
ధర్మమే రాజమార్గమని
విచక్షణతో రచించుకో
కాలమే జవాబుదారీయని
తేటతెల్లం గావించుకో
పరమపదమే పరమాత్మయను
సంతోషం పంచుకో
దుఃఖం అడ్డుగోడయను
సంగతిని అవగతం చేసుకో
సారమంతా నీ కనుల
ముందు సాక్షాత్కరిస్తుందనే
సత్యాన్ని దర్శించుకో
నిత్యచైతన్యమే నీ శ్వాస
కానుందని గ్రహించుకో
శ్రీకృష్ణతత్వమే శ్రీరామరక్షయని
నిన్ను నీవు అవలోకించుకో
కామెంట్‌లు