పంజాబ్! :- అచ్యుతుని రాజ్యశ్రీ

రాష్ట్ర భాష పంజాబీ,పక్షి ఈస్ట్రన్ గోషక్. రాష్ట్ర జంతువు బ్లాక్ బక్.విశ్వమంతా ప్రసిద్ధం గోల్డెన్ టెంపుల్.అమృత సర్ లో ఉంది.ఒకప్పుడు దట్టమైన అడవిలో చిన్న సరస్సు గాఉన్నది ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది.గౌతమబుద్ధుడు కొంత కాలం ఇక్కడ గడిపాడు. తొలి సిక్కు గురువు ఈసరస్సువద్ద తపస్సు ధ్యానం చేశాడు.ముస్లిం హిందూ సమ్మేళనంగా గోల్డెన్ టెంపుల్ నిర్మాణం జరిగింది.క్రీ.పూ.1500 తర్వాత ఆర్యులు నివసించారు. అలెగ్జాండర్ ఆతర్వాత మౌర్యులు ఆక్రమించారు. వెస్ట్ పంజాబ్ ని ముస్లింలు ఆక్రమించారు. 18వశతాబ్దిలో సిక్కుల పెత్తనం ఆపై బ్రిటిష్ పెత్తనం వచ్చింది.1947లో పశ్చిమ భాగం పాకిస్థాన్ కి,తూర్పు భాగం భారత్ లో కలిశాయి 1నవంబర్ 1966లోహిందీ ప్రాంతం హర్యానా గా,హిమాచల్ ప్రదేశ్,పంజాబ్ గా మూడు ముక్కలైనాయి.పంజాబ్ అంటే 5నదులప్రాంతం అని అర్ధం.పంజ్  ఆబ్ అనే పర్షియన్ పదాల అర్ధం 5నదులని.బియాస్ సట్లెజ్ నదుల మధ్య ప్రాంతంని దో ఆబా అంటారు.భాక్రాడాం అతిపెద్ద  హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు.గోబింద్ సాగర్ రిజర్వాయర్ వెన్నెముక  అని చెప్పొచ్చు.పాటియాలా లోని మోతీబాగ్ పాలెస్ ,నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్  ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చి  భవనాలు పేర్కొనదగ్గవి🌹
కామెంట్‌లు