హారిక అల్లరి అమ్మాయి. చిన్నప్పటి నుంచీ తరగతిలో చాలా అల్లరి చేసేది. తా చెడ్డ కోతి వనమెల్ల చెరచినట్లు మిగతా స్నేహితులను కూడా అల్లరిపిల్లలుగా తయారు చేసేది. ఉన్నత పాఠశాలకు వచ్చిన తర్వాత హారిక అల్లరి శ్రుతి మించింది. 8వ తరగతిలో ఉండగా హారికకు క్లాస్ టీచరుతో దారుణమైన చివాట్లు తిన్నది. ఆ తర్వాత హారిక అల్లరి తగ్గించి చదువులో పడింది. హారిక తెలివైన అమ్మాయే. కానీ చదువు పక్కన పెట్టి, అల్లరి పనులు చేయడం వల్ల చదువులో వెనుకబడింది. టీచరుతో చివాట్లు తిన్నాక ఇప్పుడు చదువులో పడిండి. కుక్క తోకకు రాయి కట్టాక ఆ తోక చక్కగా అయింది.
కాలం గడిచింది. మళ్ళీ కుక్క తోక వంకర బుద్ధి ఎక్కడ పోతుంది. ఈసారి హారిక ఉపాధ్యాయులు పాఠం చెప్పేటప్పుడు వారి కళ్ళు గప్పి, తోటి విద్యార్థులను పాఠం విననీయకుండా చేసేది. వాళ్ళను ముచ్చట్లలోకి లాగడం, కుళ్ళు జోకులు వేసి నవ్వించడం వంటి పనులు చేసేది. హారిక కారణంగా తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల చేత తిట్లు, దెబ్బలు తినేవారు. హారిక తాను అమాయకంగా నటిస్తూ ఉపాధ్యాయుల దృష్టిలో బుద్ధిమంతురాలుగా పేరు తెచ్చుకున్నది.
శ్రుతి, లయలు ఆ తరగతిలో అత్యంత తెలివైన అమ్మాయిలు. మంచి స్నేహితురాళ్ళు. హారిక వాళ్లనూ వదిలిపెట్టలేదు. ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించి వారి మధ్య శత్రుత్వం సృష్టించడానికి శతవిధాలా ప్రయత్నించింది. ప్రీ ఫైనల్స్ తర్వాత శ్రుతిలయలు ఇద్దరూ తమ మధ్య ఉన్న అన్యోన్య స్నేహాన్ని మళ్ళీ చాటుకున్నారు. హారిక వాళ్ల అమ్మ కనిపిస్తే ఆమెకు శ్రుతిలయలు హారిక స్వభావాన్ని తరగతిలో ఆమె ప్రదర్శించే వంకర బుద్ధినీ పూసగుచ్చినట్లు చెప్పినారు. ఇంటికి వెళ్లిన తర్వాత హారిక వాళ్ల అమ్మ హారికను కఠినంగా తిట్టింది. 10వ తరగతిలో తక్కువ మార్కులు వస్తే చదువు మానిపించి ఎవరి ఇంట్లోనైనా పనిలో పెడతానని చెప్పింది.
హారికకు తాను పరీక్షలో ఫెయిల్ అవుతానన్న భయం బాగా పట్టుకుంది. ఈ కొద్ది రోజులలో ఏమేం ముఖ్యమైనవి చదవాలో స్నేహితులను అడిగింది. ఈమె అల్లరి మూలంగా ఈమె కారణంగా ఉపాధ్యాయులచే తరచూ తిట్లు తిన్న ఆ అమ్మాయిలు ఒక్కరూ చదువులో సాయం చేయలేదు. ఎంత బతిమాలినా ఫలితం శూన్యం. ఏమేమి ముఖ్యమైన ప్రశ్నలు చదవాలో, అర్థం కానివి వివరించమని శ్రుతిలయలను కోరింది. అన్యోన్యంగా ఉండే స్నేహితుల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్న నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చావని శ్రుతిలయలు నిలదీశారు. ఎవ్వరూ సాయం చేయలేదు. ఫలితంగా హారిక 10వ తరగతి ఫెయిల్ అయింది. భవిష్యత్తు తలచుకుని బోరున ఏడ్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి