శ్రీ పాలి పరుగులాంటి నడకతో బస్టాండ్ చేరింది. కిక్కిరిసిన బస్సులో కష్టం మీద ఎక్క కలిగింది... ప్రతిరోజు ఇదే పరిస్థితి.....
స్కూటర్ కొనుక్కుందా మంటే కలసి రాని ఆర్థిక పరిస్థితి..... తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని
చిన్నచిన్న ఆన్లైన్ జాబ్స్ చేసుకుంటూ చదువు కొనసాగిస్తుంది... ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటే ఏదో జాబు లో చేరి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండొచ్చు..
అనుకుంటుంది..... నేటితరం యువతీ యువకులు లాగా విచ్చలవిడి ప్రవర్తన లేని శ్రీపాలి నిరాడంబర జీవి. చదువు తప్ప వేరే వ్యాపకాలు లేని సున్నిత స్వభావి...
కాలేజ్ స్టాప్ రావడంతో బస్సు దిగి కాలేజ్ వైపుగా నడవసాగింది శ్రీపాలి.
"హాయ్ శ్రీ"అంటూ చుట్టుముట్టారు క్లాస్మేట్స్
శ్రీ క్లాస్ టాపర్ కావడంతో అందరూ ఆమెను అభిమానిస్తారు...
శ్రీపాలి కూడా వాళ్ళతో స్నేహంగా ఉంటుంది
అందరూ కలిసి క్లాసుకి వెళ్లారు..
* * *
శ్రీపాలి తల్లి తండ్రులు.. మధ్య తరగతి వాళ్ళు.. తండ్రి ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబు... తల్లి టీచర్... ఇద్దరు పిల్లలలో శ్రీపాలి పెద్దది.. శ్రీపాద నానమ్మ తాతయ్య లతో వారిది చక్కటి కుటుంబం. వచ్చే ఆదాయంతో గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నారు.
తమ్ముడు గోపాల్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు....
తెలతెలవారుతూనే నిద్ర లేచి చదువుకుని తర్వాత నానమ్మ తాతయ్య అవసరాలు చూసి అమ్మకు వంటలో సహాయం చేసి ఎవరి డ్యూటీలకు వారు వెళ్తారు.... తాతయ్య నానమ్మలు విశ్రాంతి తీసుకుంటూ చిన్న చిన్న పనులు చక్కపెడతారు......
చక్కని భారతీయ కుటుంబ వ్యవస్థ కు ప్రతీకగా
ఉంటుంది వారి కుటుంబం...
* * *
ఆహ్లాదకర సాయంకాలం.. అలసి సొలసిన వారంతా విధులు ముగించుకుని ఇల్లు చేరారు. అందరికన్నా ముందుగా ఇల్లు చేరే శ్రీపాలి ఇంకా రాలేదు... నాన్నమ్మ తాతయ్యలు ఎదురుచూస్తున్నారు... అమ్మ నాన్న తమ్ముడు అందరూ ఇల్లు చేరారు.... ఎప్పుడు కాలేజీ నుండి లేటుగా రావడం అనేది లేదు శ్రీ పాలికి. లేటుగా రావలసి వస్తే ముందుగానే చెప్పేది తల్లిదండ్రులకు... ఫోన్ కూడా చేయలేదు. ఏమైందో ఏమిటో అనుకుంటూ ఆతృతగా ఎదురు చూడసాగారు.
శ్రీ పాలిరాక కోసం ఎదురు చూస్తున్నారు అందరూ...
" బయట పరిస్థితులు బాగా లేదు ఏంటో శ్రీపాల్ ఇంకా ఇంటికి రాలేదు అలా రోడ్డు మీదకి వెళ్లి చూసి రండి రా అన్నది కొడుకుతో శ్రీ పాలి నానమ్మ...
అంతలోనే బయట ఆటో చప్పుడు విని అందరూ బయటికి వచ్చారు.. శ్రీపాద ఆటోనుండి దిగుతూ కనిపించింది వారికి...
"హమ్మయ్య" అనుకుని తేలికగా నిట్టూర్చారు
వస్తూనే శ్రిపాలి నానమ్మ తాతయ్య... అమ్మానాన్న నాకోసం కంగారు పడినట్లు ఉన్నారు ఫోన్ చేద్దామనుకుంటున్నా చేయలేకపోయాను...
అలాంటి పరిస్థితి అంటు ఉండగా..
"నీవు క్షేమంగా ఇల్లు చేరావు మిగతా సంగతులు తరువాత చెబుతూగానీ ముందు ఫ్రెష్ అప్ అయ్యి
భోజనం చెయ్యి అన్నారు శ్రీ పాలి నాన్న...
* * *
శ్రీ పాలి ఫ్రెష్ అప్ ఐ భోజనం చేసి తన రాకకు ఆలస్యం ఎందుకయిందో చెబుతుంది
ఫ్రెండ్స్ తో బస్సు కోసం బస్టాండ్ లో వెయిట్ చేస్తుండగా
బుల్లెట్ స్పీడ్ గా వస్తూ రోడ్డు మీద నడుస్తున్న ఒక యువకుడిని డాష్ చేస్తూ నడిపాడు బుల్లెట్ వాడు.
దానితో ఆ అబ్బాయి శోష తో పడిపోయాడు...మేము చూస్తుండగానే ఆక్సిడెంట్ జరిగింది.చూస్తూ ఊరకోలేక
మేజర్ దెబ్బలతో బ్లడ్ కారు తున్న అబ్బాయిని 108 వాహనం లో హాస్పిటల్ కి తీసుకెళ్ళి అడ్మిట్ చేయించాం...బైక్ వాడిని క స్టడీ లో ఉంచాము....
ఆ అబ్బాయి ఎవరో ఏమిటో అడ్రస్ తెలియదు..
తన ఫోను కూడా కింద పడి పగలడం వల్ల పని చేయడం లేదు..... డాక్టర్స్ ప్రథమ చికిత్స చేసి
స్కాన్ చేసి చూశారు. సర్జరీ చేయాలంటున్నారు
అబ్బాయి కొంచెం స్పృహలోకి వచ్చాడు కానీ మాట్లాడలేక పోతున్నాడు... మా కాలేజీ అబ్బాయిలు అబ్బాయికి సాయంగా హాస్పిటల్ లో ఉన్నారు... ఆడపిల్లల మేము ఇంట్లో కంగారు పడతారని వచ్చేసాం
తను లేట్ గా రావడానికి కారణం చెప్పింది శ్రీ పాలి తన వాళ్ళతో...
శ్రీ పాలి చెప్పినది విని కుటుంబ సభ్యులు చాలా బాధ పడ్డారు .అతన్ని హాస్పిటల్లో చేర్చినందుకు శ్రీపాల్ ఫ్రెండ్స్ గ్రూపును అభినందించారు. ఆపదలో ఉన్న వారే మానవత్వం ఉన్న మనుషులు అంటూ కొనియాడారు.
యాక్సిడెంట్ అయిన అబ్బాయి దగ్గర నైట్ అంతా శ్రీ పాలి క్లాస్మేట్ రవి ఉన్నాడు.
మర్నాడు ఉదయం శ్రీ పాలి తొందరగా తమ దినచర్య పూర్తిచేసుకుని హాస్పిటల్ కి వెళ్ళింది. పేషెంట్ అబ్బాయి స్నహ లోకి వచ్చాడు కానీ ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళతో సైగ చేస్తున్నాడు... తన గురించి ఏమీ చెప్పలేక పోతున్నాడు....
రవి ని ఇంటికి వెళ్ళమని చెప్పి శ్రీ పాలి... పేషెంట్ బాధ్యత తీసుకుంది.. పేషెంట్ శ్రిపాలిని చూడగానే తన కళ్ళు ఆనందంగా మెరిసాయి..... శ్రీ పాలి పేషెంట్ కి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తూ ఉంది. శ్రీ పాలి క్లాస్ మేట్స్
ఒకరి తర్వాత ఒకరుగా పేషెంట్ దగ్గర ఉంటూ ఆయన వైద్యానికి కావాల్సిన ఖర్చులన్నీ సమిష్టిగా భరిస్తున్నారు....
పేషంట్ అబ్బాయి పేరు కూడా తెలుసుకోలేక పోయారు తనకి యాక్సిడెంట్ అయినప్పుడు దొరికిన పేపర్స్ ఎవరు పట్టించుకోలేదు.. పాకెట్ లో దొరికిన కార్డులు అవి కూడా కలెక్ట్ చేయలేదు. అప్పుడే గుర్తొచ్చిన వారిలా అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు పాకెట్ లో ఉన్న కార్డులన్నీ పరిశీలన చేయడానికి ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకొని చూశారు.... తను లోకల్ బాయ్ కాదు... విజిటర్ గా వచ్చాడు ఇండియాకి
వీసా పాస్పోర్ట్ చూసి తెలుసుకున్నారు... ఆ అబ్బాయి బసచేసిన హోటల్ కార్డు కూడా ఉంది.. వాళ్ళు హోటల్ కి వెళ్లి కనుక్కున్నారు.. బాయ్ యూఎస్ సిటిజన్ అని తనకి చాలా కాల్స్ వచ్చాయని తనకి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పాడు హోటల్ మేనేజర్..... హోటల్ దగ్గర అబ్బాయి పేరెంట్స్ నెంబర్ తీసుకుని వచ్చారు శ్రీపాలి క్లాస్మేట్స్..... అబ్బాయి గురించి తెలుసుకొన్న శ్రీపాలి
పేరెంట్స్ కి అప్పుడే కాల్ చేయొద్దని తను కోలుకుంటున్నాడు కదా తర్వాత చేద్దాము అని చెప్పింది.. అందరూ సరే అన్నారు.
**************
యాక్సిడెంట్ కుర్రాడు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అతని పేరు దేవాంశ్ గా గుర్తించారు. లెఫ్ట్ లెగ్ లో బోన్ ఫ్రాక్చర్ కావడం వలన సర్జరీ చేయాల్సి వచ్చింది.
సర్జరీ పూర్తి ఐ పూర్తిగా కోలుకుని మాట్లాడటం మొదలు పెట్టాక పేరెంట్స్ కి తన క్షేమంగానే ఉన్నట్లు తెలియజేశాడు దేవాంశ్...
శ్రీ పాలి తన క్లాస్ మేట్స్ తో కలిసి దేవాంశ్ కి ఎంతగానో సపర్యలు చేసింది. దేవాన్స్ కూడా వాళ్ళందరికీ ఎంతగానో ఋణపడి ఉన్నానని వారు తనకు పునర్జన్మను ప్రసాదించారని ప్రశంసించాడు...
తను ఇండియా చూడడానికి వచ్చానని... తన పేరెంట్స్ తెలుగు వారని వారి పూర్వీకులు కూడా ఇక్కడ ఉన్నారు అని వాళ్ళను కలవాలని ఆశతో వచ్చాను వచ్చిన మూడు రోజులకేనాకు యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరం అంటూ బాధపడ్డాడు..
దేవాంశ్ ను డిశ్చార్జ్ చేస్తున్నారు. తను ఎక్కడ ఉండాలన్నది ప్రశ్న... హోటళ్లలో ఉండడం కుదరదు చేసేవాళ్ళు ఉండరు. ఎక్కడకు తీసుకెళ్లాలా అన్న ఆలోచన.. వారి పేరెంట్స్ కబురు చేసి వేరే ఇంట్లో ఉంచాలా అని అనుకున్నారు. ఇంక కొన్నాళ్ళు హెల్త్ చెకప్ కి రావాల్సి ఉంటుంది. కనీసం మూడు నెలలు అయినా ఉండాలి ఇండియాలో.......
శ్రీ పాలి దేవాంశ్ వ్యక్తిత్వం చాలా నచ్చింది అతని మాట తీరు వ్యవహార సరళి అందరితో కలుపుగోలుగా ఉండే మనస్తత్వం ఆర్థిక అసమానతలు చూడని స్వభావం....
తను అభిమానించే వ్యక్తిగా, సహృదయుడు గా ఆమె మదిలో నిలిచాడు... అతన్ని తన ఇంటికి తీసుకెళ్లాలని kఆలోచనైతే ఉంది... అందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారో లేదో అని సంశయిస్తుంది...
చూచాయగా దైవాంశ డిఛార్జ్ చేస్తున్నారని నాన్నమ్మకు చెప్పింది శ్రీపాలి....
"ఎక్కడికి తీసుకెళ్తున్నారు మరి యూ ఎస్ కి వెళ్ళిపోతున్నా రా "అని అడిగింది నానమ్మ
లేదు నాన్నమ్మ ఇంకా హెల్త్ చెకప్స్ ఉన్నాయంట తను ఇంకా సరిగా నడవడం లేదు కదా పూర్తిగా కోలుకున్న తర్వాత వాళ్ల పేరెంట్స్ కి తెలియచెప్పి వెళతాడు "నాన్నమ్మకు చెప్పింది శ్రీపాలి
"అయితే మన ఇంటికి తీసుకు రారా మనం అందరం ఉన్నాం గా... తనని బాగా చూసుకొని కోలుకున్న తర్వాతనే పంపిద్దాం "నాన్నమ్మ భుజాలు కుదుపుతూ సంతోష పడిపోయింది శ్రీపాల్ థాంక్యూ నానమ్మ అంటూ....
"కానీ వాళ్ళు చాలా ధనవంతులు కదా తను మన ఇంట్లో మన పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోలేరేమో నమ్మా"
"ప్రస్తుతానికి తీసుకొద్దాం నాన్నమ్మ తనకి నచ్చకపోతే తను ఏ హోటల్ రూమ్ లోనే ఉంటాడు" కానీ అతడు అలాంటివాడు కాదేమో అని అనుకుంటున్నాను.. అన్నది శ్రీ పాలి....
డిఛార్జ్ ఐ దేవాన్స్ శ్రీపాల్ ఇంటికి వచ్చాడు... కుటుంబ సభ్యులంతా సాదరంగా ఆహ్వానించి ఎంతో ఆదరంగా చూశారు.. మూడు నెలలు టైం ప్రకారం గా మెడిసిన్స్ ఇస్తూ ఎక్సర్సైజులు చేయిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతుడు ని చేశారు.... ముఖ్యంగా శ్రీ పాలి నిద్రాహారాలు మాని అతనికి సేవ చేస్తూ గడిపింది
దేవాంశ కూడా శ్రీపాలి సేవకు ఆశ్చర్య పడే వాడు
ఎక్కడ అమెరికా ఎక్కడ ఇండియాలో ఆంధ్ర ప్రదేశ్
ఏ బంధము తో దగ్గర అయ్యామో తెలియదు.... జన్మంతా రుణపడి ఉంటాను శ్రీ పాలికి వారి స్నేహితులకు వారి కుటుంబ సభ్యులకు అనుకుంటూ. సంపూర్ణ ఆరోగ్యవంతుడై జరిగిన పరిస్థితుల లన్నిటిని పేరెంట్స్ కి వివరించి చెప్పాడు... అది విని పేరెంట్స్ హుటాహుటిన ఇండియాకు బయలుదేరారు...
శ్రీ పాల్ ఇంటికి వచ్చి దేవాంశ తల్లిదండ్రులు కొడుకును కౌగలించుకుని ఇంత జరిగినా మాకెందుకు తెలియజేయ లేదంటూ నిష్టూర మాడారు....
ఎక్కడ ఉన్న మీరు నాకు యాక్సిడెంట్ అయింది అని తెలిస్తే తట్టుకోలేరని చెప్పలేదు అన్నాడు...
శ్రీ పాలి ఆమె స్నేహితులు ఆమె కుటుంబ సభ్యులు నాకు పునర్జన్మను ప్రసాదించారంటూ చెప్పాడు. వారు వారందరికీ ధన్యవాదాలు చెప్పారు....
శ్రీ పాల్ కుటుంబ సభ్యులతోనూ ఆమె స్నేహితులతో ఆనందంగా గడిపి వారు అమెరికాకు ప్రయాణం అయ్యారు.... శ్రీపాల్ దేవాన్ష్ ల మధ్య మాటకు అందని మౌనరాగం.... ఆ రాగానికి భాష్యం చెప్పలేము....
వెళుతూ వెళుతూ శ్రీపాల్ ని అడిగాడు దేవాంశ...
ఏమీ అనుబంధం మనది అని
"మరచిపోలేని మధురమైన మానవత్వ బంధం"
నీళ్ళు నిండిన కళ్ళతో వీడ్కోలు చెబుతూ చెప్పింది
శ్రీ పాలి.
* సమాప్తం *


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి