మట్టి మనిషి మనుగడకు మార్గదర్శి మనం నడిచే నేల
మన పుట్టుకకు ఆధారం.
మన భవిష్యత్తు నిలబడే బలం.అదే నేల నేడు మన చేతుల్లోనే క్షీణిస్తోంది. కానీ ఇదే సమయంలో ఆ నేల మనల్ని పిలుస్తోంది… “నన్ను కాపాడు… నిన్ను నేను కాపాడుతా” అని.
ఈ రోజు మట్టి కేవలం భూమి కాదని, మన జాతి శ్వాస, మన జీవితానికి మూలధనం అని గుర్తుచేసే రోజు. ఒక గుప్పెడు నేలలో దాగి ఉన్న అద్భుతాలు—
వేలాది సూక్ష్మజీవాలు, ఆశలు, పంటలు, భవిష్యత్తు. రసాయనాల దాడితో అలసిపోయిన ఆ నేల.
నీరులేని ఎండతో పగిలిపోతున్న ఆ భూమి… మన తప్పులను మౌనంగా భరిస్తూనే ఉంది.
అయితే నేడు మనం మారాలి.
మట్టి ఆరోగ్యం అంటే—మన ఆరోగ్యం. భూమి సంరక్షణ అంటే—మన భవిష్యత్తు సంరక్షణ. ఒక్క విత్తనాన్ని నాటి,
ఒక్క చెట్టును పెంచి,
విషరహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించి, నీటిని కాపాడి
మనమే మట్టిని మళ్లీ జీవంతో నింపాలి. ప్రపంచ నేల దినోత్సవం సందేశం ఒకటే
“భూమి నిన్ను ఎన్నిసార్లు నిలబెట్టిందో గుర్తు పెట్టుకో…
ఇప్పుడు భూ తల్లిని నిలబెట్టుకునే సమయం నీది!”ఈ రోజు నుంచే మనం ఓ ప్రతిజ్ఞ చేద్దాం
మట్టిని కాపాడుదాం… మనుగడను నిలబెట్టుదాం.
మీ
-ఎస్.వి రమణా చార్య, సీనియర్ జర్నలిస్ట్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి