| డా. యు. వి రత్నo | మేనేజింగ్ డైరెక్టర్ |
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్
ఆధ్వర్యంలో తెలుగు భాష సేవా స్ఫూర్తి పురస్కారాల విజయోత్సవ సభ
![]() | ||
| డా. ధనాశి ఉషారాణి | జాతీయ అధ్యక్షురాలు |
తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలకు పట్టము కడుతూ నిరంతర సాహితీ ప్రస్థానంలో
పల్లె జానపద కళాకారుల కీర్తికి పట్టము కడుతూ డా.యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ మరియు డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు నిర్వహణలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తిస్తూ తెలుగు సేవా స్ఫూర్తి పురస్కారాలను హనుమంతరాయ గ్రంథాలయoలో ఆదివారం మధ్యాహ్నము నాలుగు గంటలు నుంచి రాత్రి 9 గంటలు వరకు జరుగును.
28.12.25 తేదీ ప్రముఖులు డా .జి.మురళీ కృష్ణ రిటైర్డ్ ఆడిషినల్ ఎస్పీ డా . జి. కొండల రావు రీసర్చ్ డైరెక్టర్ డా .జగదీశ్వర రావు ప్రముఖ న్యాయవాది మరియు డా .వి డి .యస్ .ప్రసాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డేవిడ్ రాజు రిటైర్డ్ పోలీస్ అధికారి చేతులు మీదుగా తెలుగు భాష సేవా స్ఫూర్తి పురస్కారాలను అందజేయనున్నారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలుతో పిల్లలు కనులు విందు చేయనున్నారు. అలనాటి మేటి పాటలతో రసజ్ఞలైన ప్రేక్షకులను సింగర్స్ పాత కొత్త కలయికతోటి ముచ్చటగా అలరించనున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల నుండి 100 మంది కవులు కళాకారులు సభలో పాల్గొననున్నారని డా. ధనాశి ఉషారాణి పోగ్రామ్ కన్వీనర్ తెలియజేశారు. తెలుగు భాషకు వన్నె తెచ్చే మేటి కార్యక్రమమే ప్రతిభ అవార్డుల కార్యక్రమం అంటూ అందరికీ డా. యు. వి రత్నo పిలుపు ఇవ్వడము జరిగింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి