రైతే రాజు :- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)- సారవకోట
 పూర్వం రైతే రాజు..
ప్రగతి గల మోతుబారి రైతు..
ప్రస్తుతం గతి తప్పిన రైతు.
పల్లెటూరి బైతు అని
పలుచగా చులకనగా చూస్తున్నారు 
పట్టణ, నగర ప్రజలు..
పనిపాట్లకు వ్యవసాయం సాయం.
పంట పండి ఇస్తుంది ఫలసాయం
కమతం రైతు మతం. ఆనాడు జనసమ్మతం..
ఖేతం నమ్ముకుంటే లేదు ఊతం.
పైరుకు తడి లేక రైతుకు కంటతడితో
బ్రతుకు అఖాతం.
ప్రకృతి ప్రకోపంతో..
పంటకు దినదినగండం,
అప్పుల సుడిగుండం..
రైతులకు యమగండం నేడు.

కామెంట్‌లు