సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

సామెత -93:- అల్లుడికి పెట్టినట్టు కొడుక్కి పెడ్తే ఇల్లు గుల్లే
*****
"ఇగ జూశినవా అవ్వా! మా కొంపల దినాం ఓ సంగతి రావణ కాట్టమోలె రగుల్తా వుంది. మీ మర్ది కొడుక్కి సమజయ్యేలా చెప్పాలె గద! ఆయనేమో ఏమెరుగని ఎర్రి మొకపోడిలా,గిదంత నాదే అన్నట్టు పక్కకు తొల్గిండు.ఇంగ వొండి పెట్టేది నేనేగద. గందుకని నా మీద వడ్డడు. తొమ్మిది నెల్లు మోసి కన్నదాన్ని గాళ్ళకి కడ్పు నిండ పెట్టకుండ ఉంటనా? నాకు సుత గాళ్ళు ఇట్టపూర్తిగ తింటుంటె మల్ల మల్ల సూడాలని ఉండదా?గద్దెల్సుకోకుండ కడ్పున బుట్టినోళ్ళు నన్ను బద్నాం జెయ్యడమేమన్నా బాగుందా శెప్పవ్వా?" 
పైంగ  నేనట ఎప్పుడు జూశినా శేతిల ఒక్క పైస లేదంటనట! రావల్శినోళ్ళు ఒత్తె మట్కు  రకరకాలు జేస్పెడ్తనట. ఒక్క తీర్గ నన్ను రద్ది జేస్తుండ్రు.
"ఎన్నన్న అన్కొని తీ అని నోర్మూసుకుని వుంటే ...అగ్గ జూష్నవా! ఒక్క మాట సుత నోర్దెరుత్తుట్లే లేదు.నాలి ముచ్చునట. ఎన్ని అనాల్నో  అన్ని అంటుండ్రవ్వా! ఇన్నాళ్లూ  మన తరం కలో గంజో అమ్మ నాయిన పెట్టింది తిని బత్కినం. గిట్ల నన్ను రద్ది జేత్తే ఏమొత్తది జెప్పవ్వా ?"
 "ఏందోనే శెల్లె నువ్వు చెప్పింది ఒక్కటి సుత సమజైత లేదు. ఎవల గురించి ఎవలు గంత గంత మాటలన్నది?
ఇంకెవడు అవ్వా!  ఆడే పెద్దోడు. ఆడి మీద నాకు సూది మొనంత పేమ సుత లేదట.అంతా అల్లునికే దోశి పెడ్తున్నంట.దినాం లొల్లినే.ఏం జెయ్యాల్నో కాల్జేతులు ఒట్టు .
"శెల్లే! గాడికి ఏం దెల్వదు తీ!ఉడ్కు రకతం గీళ్ళ ఆలోచెన్లు గట్లనే ఉంటయ్. "అల్లునికి పెట్టినట్టు కొడుక్కి పెడ్తే ఇల్లు గుల్లవుద్ది". అల్లుడు గాబట్టి మన్నం తిన్నా తినకున్నా మరియాద జేయడం తప్పదాయె.ఏం తేడొత్తే ఏమైతదో పిల్ల మీద గా దాని పెబావం పడ్తదని బయమాయె. ఐనా  అల్లుడన్నంక  వచ్చుడు పోవుడు వుంటది. నువ్వు మాత్తరం ఏం జేత్తవ్.అప్పో సప్పో జేసి పెట్టుడాయె. గట్ల కొడుక్కి సుత బెడ్తె ఇల్లు గుల్ల గాక ఇంకేమైతది. నువ్వేం బుగులు బడకు.ఇడమర్సి నే సెప్త తీ!"..గా అవ్వ మాటల్కి గుండెల బర్వు దిగినట్టైందనుకుంటా సంబురంగ ఇంటికి బోయింది.
"గదండీ సంగతి"అల్లుడికి పెట్టినట్టు కొడుక్కి పెడ్తే ఇల్లు గుల్లవుడు ఖాయం.".
కామెంట్‌లు