చీర : - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)-సారవకోట
 చీరా అని అనకండి.
చీదరించకండి..
చీపుగా చూడకండి..
మగువలకు మరింత శోభనిచ్చేవి
మహిళల మనసుకు నచ్చేవి.
మర్యాదనిచ్చేవి, మగవారు మెచ్చేవి
వనితలకు వన్నె తెచ్చేవి చీరలు.
నారీమణులకు నవవిధాలుగా
ఉపయోగపడేవి.. 
నార చీరైనా జరీ చీరైనా
పట్టు చీరైనా కట్టేదేచీరైనా
భారతీయ సంస్కృతీ
సంప్రదాయాలను ఇనుమడింపజేసేవి,
ప్రపంచానికి ప్రతిబింబింపజేసేవి.

కామెంట్‌లు