సామెత -66-అప్పులున్నోడితో ,చెప్పులున్నోడితో తిరగొద్దు
****
"అవ్వా! అవ్వా! మన బుడ్డోడు గీ మద్దెన బుద్ధి లేనోడైతుండు.గీడికి సోపతిగాండ్లు ఎక్కువైండ్రు.ఆల్లెంబడి ఈల్లెంబడి బడి తిరుగుతుండవ్వా!"
మన్వరాలు భూలచ్మి షికాయితికి బుడ్డోడు ఏమెరగని ఎర్రోనొతికె పెట్టిన మొగం చూసి అవ్వకు మస్తు నవ్వొచ్చింది.నవ్వితే బుడ్డోడికి సులకనైతనని నవ్వుని బిగబట్టుకొని ఎవలెవలెంబడి తిరిగిండు? ఏమన్న శెడ్డ పని శేషిండా ఏంది?"అంది.
అవ్వ గట్ల అడిగే తల్కి జరంతెక్కువ కుశాలుతో "అవ్వా! గీడు పురాగ ఆగమైతుండు.నా పైనున్న తర్గతి అన్నల్తో తిరుగుతుండు.గా అన్నల్సల్కి మంచోళ్ళుగారు.ఈరేశు అన్నైతే ఎప్పుడూ పక్క దోత్తుల దెగ్గర మల్లిత్తలేరా అన్కుంట రూపాయి,రొండు రూపాయలు అడుక్కొని బడెదురుంగ కొట్లెకెళ్ళి జీడీలు,పప్పుండలు బిస్కోట్లు కొనుక్కోని తింటడవ్వా! గీడికి అందులో గింత దీసి బెడ్తుండని గా అన్నకి తోక లెక్క గీడు తిర్గబట్టిండు.
"అవునానే భూలచ్మీ! గీడు గింత బూకరోడు అయ్యిండా! అవునారా వారీ?"
"గిదొక్కటే గాదవ్వా! గా మొన్న మన తాత నాకు బుడ్డోడికి శెరో రూపాయి ఇచ్చిండు గద.బుడ్డోడు సంబురాన్కి గా రూపాయిని బల్లెకు గొంటబోయిండు.గజ్జూసిన ఈరేశన్న బుడ్డోడ్ని బుదగరిచ్చి మల్ల నీకు రొండు రూపాయలు ఇత్త తీ అన్కుంట తీస్కుండు. ఇంగ ఇచ్చుడు లేదు ఏం లేదు.ఈరేశన్న దోత్తులిచ్చిన పైసలు మన బుడ్డోడు పైసలు ఇత్తనే లేడవ్వా! పైంగ గీడంట అన్న తెమ్మంటె అవివ్వి కొట్లెకు బొయ్యి తెచ్చిడంట. కొట్టు తాత ఇయ్యాల నన్ను పిలిచి బుడ్డోడి యిసయం జెప్పిండవ్వా!
"వార్నీ! గిట్ల ఎన్ని దినాల్నించిరా బుడ్డోడా! గా ఈరేశు గాడితో తిరిగేది?" "అప్పులున్నోడితోటి - చెప్పలున్నోడితోటి" అస్సల్కి తిర్గొద్దురా.ఇంకో పాలి తిరిగావని తెలిత్తే నీ బుగ్గలు బిండి బూరెలు జేత్త ఏవనుకున్నవో" అంది."
"అప్పులున్నోడి యిసయం జెరంత సమజైంది గని గా చెప్పులున్నోడితో ఎందుకు తిర్గొద్దవ్వా? అన్న భూలచ్మి మాటల్కి అవ్వ మాట్లాడుతూ...
"శెప్ఫులున్నోడు సుఖంగా రాళ్ళ మీద,ఎండల,ముల్లల్ల కంచెల్ల ఎటంటె అటు తేలిగ తిర్గ గల్గుతడు. ఆడికి ఏం గాదు గని శెప్పుల్లేనోడు మరి శెప్పులున్నోడి లెక్క తిర్గితే కాళ్ళు కాల్తయి, ముళ్ళు గుచ్చుకుంటయ్ .కంప గీర్కబోతది. గందుకే శెప్పులున్నోడితో సమానంగా శెప్పుల్లేకుండ తిర్గలేం.
గందుకేనే భూలచ్మీ! శెప్పులున్నోడితో - అప్పులున్నోడితే అస్సల్కి తిరగొద్దు " అంటరు.అవ్వ మాటలు యిన్న బుడ్డోడు ఏడ్పు మొగమేస్కోని "ఇంకోపాలి అస్కలికి చెయ్యనవ్వా! నీ మీదొట్టు!"అంటుంటె ...
" ఇగ్గో శెప్తున్నా! శిన్నప్పటి నుంచి మంచి బుద్ధులు నేర్సుకోవాలి. గస్మంటి పిచ్చి పనులు చేయొద్దు.గీపాలి గన్క తెలిత్తే తోడ్కలు దీసుడే" అన్కుంట అప్పల డబ్బలోంచి శెరొక్క కజ్జెకాయ తీసి ఇచ్చింది.
గదండీ సంగతి! "అప్పులున్నోడితో చెప్పులున్నోడితో తిరగొద్దు" అంటే...బాగా అప్పులున్నోడితో తిరిగితే గాడు మనకు కూడా టోపీ పెట్టకుండ ఉండడు. ఇగ చెప్పులున్నోడికి.. ఆడి కాళ్ళకవి రచ్చన గని మనగ్గాదుగ. గందుకే మన పెద్దోళ్ళు చెప్పే సామెతలల్ల నేర్సుకోవాల్సినవి శానుంటయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి