సహచర సమాంతర ఆలోచనల సామాజిక వేదిక, సత్యం చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంద్రా చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మల్లికార్జున గారి సహకారంతో జరిగిన పాకాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ విజేతలను టోర్నమెంట్ డైరెక్టర్ మారసాని విజయబాబు ప్రకటించారు. ఈ పోటీలలో తిరుపతి, చితూరు, అన్నమయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన అన్ని వయసుల క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. పాకాల ఉన్నత పాఠశాలలో మొత్తం ఏడు రౌండ్స్ నిర్వహించినట్టు చెప్పారు.
ఈ మేరకు ఓపెన్ కేటగిరీలో మొదటి 20 స్థానాలు సాధించిన వారు ఒరుసగా ఎ ఆభిషేక్, ఫర్హాన్ షేక్, పి వెంకటరమణ, హిమాన్షు, వి శ్రీ గురువర్షిణి, జి. గుణశేఖర్, మోహన పార్వతాల, ఎం ఏ చంద్రకుమార్, కొండారి ఈశ్వర కృష్ణ భిల్ల్వ నిలయ, ఎం. కార్తిక్, వి చేతన్ విఘ్నేష్, ఉమాపతి సి కె, పుట్ట అంశిక, కలికిరి లతీష్ రెడ్డి, టి చైతన్య, డి. యోగ్న దీప్, ఎస్. షెరుల్లీ, కోసినేపల్లి హేమకేష్, అక్షయ్ యాదవ్, పట్టణ్ సమీర్ అహమ్మద్ ఉన్నారని పేర్కొన్నారు. అలాగే అండర్ 7 క్రీడాకారులలో మొదటి, రెండవ, మూడవ స్థానంలో ఎం శివం, నివృత, సిద్ధార్థ్, అండర్ 9 క్రీడాకారులలో కోసిగి, పెన్వింద్ర కోసిగి, మణిదీప్, అర్జున్, అండర్ 11 క్రీడాకారులలో ఎం నివేద్, పి పునీత్ సాయి, గిరిచందన్ రెడ్డి, అండర్ 13 క్రీడాకారులలో అండర్ 13 క్రీడాకారులలో సి చిత్తేష్ కుమార్ రెడ్డి, పి రెడ్డి చెత్రేష్, కోసినేపల్లి మోక్షిత, అండర్ 15 లో బి అరుల్ మురుగన్, టి గౌతమ్, టి లక్షిత్ కుమార్ ఉన్నారు. వీరందరికీ ట్రోపీలతో పాటు మొత్తం 30 వేల రూపాయలు నగదు బహుమతులు అందించనున్నామని వివరించారు. ఈ టోర్నమెంట్ కు చీఫ్ ఆర్బిటర్ గా మణికంఠ కామాటం వ్యవహరించారని తెలిపారు. బహుమతులు అందించిన వారిలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఆర్ బి ప్రసాద్, లయన్ శ్రీధర్ రెడ్డి ఎం వి, సహచర కార్యదర్శి అనీల్ పోతుగుంట, కోశాధికారి మారసాని మహేష్ బాబు, మండల ప్రెసిడెంట్ జశ్వంత్ కరణం, పాకాల పి ఈ టి టీచర్ నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారని చెప్పారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలు అమర్చిన ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ రఫీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.



addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి