సుప్రభాత కవిత : -బృంద
తూర్పున తపనుడి దర్శనం 
ఓర్పున వేచిన మేదిని హర్షం 
అలల సరిగమలతో పాడిన
కడలి కదలికల సంగీతం

గాలికి ఊగుతూ హాయిగా 
వాలిన పువ్వుల స్వాగతం
రేగిన ఆశల రాగాలేవో
రేపెను మదిలో  స్వగతం

కోరిన తీరం చేరాలని 
కోరికల కలవరం
గతితప్పక అడుగులువేస్తే 
గురి తప్పక చేరే గమ్యం

మమతలు మనసుని తడిపే
మలయానిల వీచికలు
తనివి  తీరక తపించే
తపనలు దాచిన తలపులు

సాగర తీరాన వెలసిన
శిలలదెంత గొప్ప సౌభాగ్యం!
తొలికిరణపు స్పర్శ తప్పదెన్నడూ
తెలవారగనే తలనిమిరే దైవం

కానుకగా దొరికిన క్షణాలు 
కొల్లలుగా  తెచ్చు సంతోషాలు 
కన్నుల నిండుగ తెచ్చే పండుగ 
కలిమిగ  చెలిమిని  నిలిపే అండగా!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు