తెలంగాణలో ఫుట్‌బాల్‌కు ఆదరణ ఉందా? :- -ఎస్.వి.రమణా చారి,సీనియర్ జర్నలిస్ట్



 హైదరాబాద్ ప్రత్యేకత ఏమిటి?
 ఈ  ప్రశ్నలకు జవాబు చరిత్ర–సంస్కృతి–యువత అనే మూడు అక్షాల చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ లో ఫుట్‌బాల్‌కు ఆదరణ ఉంది… కానీ అది క్రికెట్‌లా కనిపించదు, లో లోపల బలంగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కి పాత రక్తసంబంధం ఉంది. నిజాం కాలం నుంచే ఆర్మీ, రైల్వే, పోలీస్, విద్యాసంస్థల ద్వారా ఈ ఆట ప్రాచుర్యంలోకి వచ్చింది. పాతబస్తీ, మలక్‌పేట్, నాంపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుట్‌బాల్ సంస్కృతి ఇప్పటికీ జీవిస్తుంది.స్కూల్, కాలేజ్ స్థాయిలో ఇంటర్–యూనివర్సిటీ టోర్నీలు, కార్పొరేట్ లీగ్స్, అకాడమీల ద్వారా యువతలో ఆసక్తి పెరుగుతోంది. టీవీ, సోషల్ మీడియా వల్ల యూరోపియన్ లీగ్స్‌కి (మెస్సీ, రొనాల్డో వంటి స్టార్స్‌కి) ఉన్న అభిమానంతో చూసే ఆటగా ఫుట్‌బాల్ ఆదరణ ఎక్కువగా ఉంది. కానీ నిజం ఏమిటంటే.ప్రభుత్వ విధానాల లోపం, మైదానాల కొరత వల్ల నిరంతరం ఆడే ఆటగా ఫుట్‌బాల్ ఇంకా పూర్తి స్థాయిలో ఎదగలేదు.
ఫుట్‌బాల్‌లో హైదరాబాద్ ప్రత్యేకత ఏమిటి?
గొప్పచరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ ఫుట్‌బాల్ ఆట ఇక్కడి వారికి నిన్నటి కొత్త కాదు. హైదర్ కప్, డ్యూరాండ్ కప్ వంటి టోర్నీల్లో హైదరాబాద్ జట్లు పాల్గొన్న చరిత్ర ఉంది. సికింద్రాబాద్ ఆర్మీ గ్రౌండ్స్, లాల్‌బహదూర్ స్టేడియం చుట్టూ ఫుట్‌బాల్ సంస్కృతి పెరిగింది. పాతబస్తీలో ఫుట్‌బాల్ సంస్కృతి ఉంది. హైదరాబాద్ ప్రత్యేకత ఇదే. గల్లీ గల్లీలో, చిన్న మైదానాల్లో ప్యాషన్‌తో ఆడే ఆట.డిసిప్లిన్, స్టామినా, టీమ్ స్పిరిట్ ఇక్కడి ఆటగాళ్లలో సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ FC (ఫతే మై దాన్ క్లబ్)కు ఆధునిక గుర్తింపు ఉంది. ఇండియన్ సూపర్ లీగ్ (ISL)లో Hyderabad FC రాష్ట్రానికి ఫుట్‌బాల్ బ్రాండ్‌ను ఇచ్చింది. టైటిల్ గెలవడం ద్వారా తెలంగాణ మ్యాప్‌లో ఫుట్‌బాల్‌ను గట్టిగా నాటింది.
యూత్ క్యాపిటల్ .. ఫుట్‌బాల్‌కు అవకాశాలు
ఐటీ నగరం కావడం, కాలేజీలు, కార్పొరేట్లు ఎక్కువగాఉండటంతో
 ఫుట్‌బాల్ అకాడమీలు,టర్ఫ్ కల్చర్, కార్పొరేట్ లీగ్స్
వేగంగా పెరుగుతున్నాయి.
అసలు సమస్య ఏమిటి?
రాష్ట్ర స్థాయి లీగ్‌లకు సరైన ప్రోత్సాహం లేదు.ప్రభుత్వ స్కూల్ మైదానాలు ఫుట్‌బాల్‌కు అనుకూలంగా లేవు. టాలెంట్ ఉన్నా ప్లాట్‌ఫామ్ లేదు. తెలంగాణలో ఫుట్‌బాల్‌కు ఆదరణ ఉంది…హైదరాబాద్‌కు ఫుట్‌బాల్‌పై ప్రత్యేకమైన చరిత్ర ఉంది…కానీ ఇంకా విధానాల గోల్ పడాల్సి ఉంది. ప్రభుత్వం నిజంగా ముందుకు వస్తే హైదరాబాద్ కేవలం ఐటీ హబ్ కాదు,ఫుట్‌బాల్ హబ్గానూ మారగల శక్తి ఉంది.

కామెంట్‌లు