బాల్యంలో పుట్టినరోజన జన్మనిచ్చిన మాతృమూర్తినూనెపెట్టి వళ్ళు నలచితలంటు స్నానం చేయించినుదుట విభూతి బొట్టు పెట్టిదిష్టి తీసి బాల సుబ్రహ్మణ్య స్వామిలా ఉన్నవనిమురిసి ముద్దాడి దిష్టి తీసినది జ్ఞాపకమే.!!వివాహమైన తరువాతసహధర్మచారిణి జన్మదినాన నూనె పెట్టితలరుద్ది విభూతితో బాటు బొట్టుపెట్టి మన్మథుడుమీముందు దిగదుడుపే అని ఆప్యాయంగాకౌగిలించుకున్నది మరువలేను...!!మనుమలనెత్తిన నాతోజన్మకు కారణమైన మీరునా ఉన్నతికి కారణమనినాన్నా నేను మీకు అభ్యంగనస్నానం చేయిస్తానని నా సప్తతి నాడువణుకుతున్న నా చేయిని తీసుకు షా0పు తోతలంటి విభూతి స్టిక్కర్ బొట్టుపెట్టినా ధర్మపత్ని దగ్గరకు తీసుకొని వెళ్ళి కూర్చుండబెట్టిమీరివురు నా పాలిటఆది దంపతులని మనుమలతో భర్తతో కలసినమస్కరించిన నా తనయను చూసినేననుకున్నా నా జీవితం ధన్యమన్నది.వారుమువ్వురునాకు దేముడు ప్రసాదించిన పరదేవతమూర్తులే..!!(3-12-25 నా సప్తతి సందర్భంగా వ్రాసిన కవిత)...........................
ఏడుపదుల వయస్సులో అనుకున్నా:- కవిమిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి