వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: - ఎంపిడిఓ రామకృష్ణారావు

 గోళ్ళు కత్తిరించుకొనుట, చేతుల పరిశుభ్రత మొదలుకొని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రత కూడా పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించుట ప్రతి ఒక్కరి బాధ్యతని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుంటముక్కల రామకృష్ణారావు అన్నారు. పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి అధ్యక్షతన జరిగిన ముస్తాబు పథకం ప్రారంభసభకు, మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ గావించారు. అనంతరం గ్రామ సర్పంచ్ దారబోయిన రెయ్యమ్మ ర్యాలీని ప్రారంభించి, స్వచ్చతను పాటిద్దాం స్వర్ణాంధ్రను సాధిద్దాం అంటూ నినాదాలతో గ్రామంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు ఎంపిడిఓ రామకృష్ణారావు చేతులమీదుగా బహుమతులను అందజేశారు. 
ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి మాట్లాడుతూ ప్రతీ తరగతి గదిలో అద్దం దువ్వెన వంటి ముస్తాబు పరికరాలను నెలకొల్పామని తెల్పుతూ ముస్తాబు పథకం ఆవశ్యకతను వివరించారు. స్థానిక యువకులు దారబోయిన ధర్మరాజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆవశ్యకతను వివరించి, గ్రామంలో స్వచ్ఛత సేవలను నివేదించారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు పర్యావరణ స్వీయ గీతాన్ని ఆలపించి చైతన్యపర్చారు.ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి ఛైర్ పర్సన్ చాంతాటి లక్ష్మి, స్థానిక సచివాలయ పంచాయతీ కార్యదర్శి దూబ రంజిత్ కుమార్, బి.నాగరాజు, ఎస్.రాము, వి.అనిగ్రేషు, వి.శారద, ఎం.సంధ్య, బి.చంద్రకళ, కె.లక్ష్మీనారాయణమ్మ,   ఎన్.పద్మావతి, బత్తుల రామలక్ష్మి, పి.చంద్రమ్మ, చిర్రా అలివేలు మంగమ్మ, పి.శ్యామల తదితరులు పాల్గొన్నారు.అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు