* బుద్ది కి పదును పెట్టు! *:- కోరాడ నరసింహా రావు !
ఆది యందు మనిషిని 
 ఆకలి, అవసరాలు ముందుకు నడిపిస్తే...! 
   తరువాత ఒనరులకు జ్ఞానం తోడై...ముందుకు తీసుకు పోయాయ్!! 
  అటు పిమ్మట విజ్ఞానశా స్త్రం మరింత మును ముందుకు తీసుకు పోయింది!!! 
     ప్రస్తుతానికి , మనిషిని  తాను సృష్టించిన నూతనావిష్కరణలే తనను బంధీని చేసి ఆడిస్తున్నయ్...! 
   ఏదైనా , అతి  
   సర్వత్ర వర్జ యేత్ ! 
 అవసరాలకు మించి అతిగా ఆరాటపడితే... 
 అనర్ధాలు తప్పవు...!! 

మనిషి తన అవసరాలకు డబ్బును సృష్టిస్తే... ఆ డబ్బే మనిషి నెత్తిన 
కూచుని...ఆటలాడించటంలేదూ...!! 
   మేధ పనిచేస్తుంది కదా అని  మారణ ఆయుధాలు కని పెట్టావ్...! 
  ప్రపంచ వినాశానికి దారులు వేసావ్...! 
   ఇదా నీ విజ్ఞానానికి ఫలి తం...!? 
  ఓ మనిషి...! అవసరానికి మించి యేదీ ఆశించకు...!! 
  సుఖ, సంతోషములతో ఆనందంగా బ్రతకటం వరకే..., 
    నియంతలామారి... 
  మారణ హోమాలకోసం కాదు....! 
  విజ్ఞానానికి  వీడ్కోలు పలికి.... బుద్దికి పదును పెట్టు...!! 
      *****

కామెంట్‌లు