సామెత -92:-అత్త లేనమ్మ ఉత్తమురాలు - మామ లేనమ్మ మా భాగ్గె శాలి
****
"అవ్వా! నువ్వెన్నన్న జెప్పు.ఏవన్న అనుగని గా సంజెమ్మ అదృట్టమే అదృట్టం పో.ఏ జికీరి లేదు.ఏ జంజాట్కం లేదు. ఆడిందే ఆట.పాడిందే పాట. గందుకే దానికి మాలావు గర్ర.పైంగ అందర్కి ఎక్కల్లేని నీతులు శెప్తుంది. పెద్దోళ్ళను గట్ల జూస్కోవాలె. శిన్నోళ్ళని గిట్ల అర్సుకోవాలె అంటది.ముసలోల్లు ముడిగోళ్లని సక్కగ సూస్కుంటెనే మల్ల జల్మల మంచి జర్గుద్దంటది.గా సంజెమ్మని సూత్తుంటె నాకైతె మస్తు కుళ్ళు బుడుతుందవ్వా!"
"గదేంది విజ్జమ్మా! గట్ల ఒకలి మీద కుళ్ళు బడుడు తప్పు గాదె! ఎవలి అదృట్టం ఎట్టుంటదో ఎవలికెర్క? నీకేం తక్వయింది. అత్త మామ ఆడి బిడ్డ, ఎప్పుడు సూశినా ఇల్లంత గుబగుబలాడ్కుంట సందడిగుంటది. గా సంజెమ్మ దేంది ఒంటి కొమ్ము సొంటి రాయి.లింగూ లిటుకు మన్కుంట ఇద్దరే.ఇల్లన్నంక నల్గురుంటేనే కళకళ."
ఏం కళకళ అవ్వా? సేశి సేశి బొక్కలు రెక్కలు బోతున్నై.నడ్ములు నొత్తున్నయి. ఓ సుఖమా! పాడా! బక్క సుక్కలు మొల్వక ముందు లేత్తె మల్ల రేతిరి సుక్కలు మొల్సే దాక పనే పని. గా సంజెమ్మకి అత్త పోరు లేదు మావ పోరు లేదు.సుఖమంటే దాందే అవ్వా?
"అంటే నీ దుట్టిలో" అత్త లేనమ్మ ఉత్తంరాలు.మావ లేనమ్మ మా బాగ్గెవంతురాలు" అంటవ్! అంతేనా విజ్జమ్మా !"
"అవుమల్ల! గంతే మరి. గా సంజెమ్మ లెక్కుంటె ఎంత మంచిగుండేదో! గీళ్ళంత నా పానాన్కి బడ్డరు."
నీ అస్మంటోళ్ళు జేబట్టే గీ రోజుల్ల పొల్లగాండ్లు గిట్ల మార్తున్నరు.ఆడపొల్లగాండ్లేమో అత్త మామ లేని సంబందాలు సూడు మంటుండ్రు.మొగ పోరగాండ్లేమో బామ్మర్థులు, మర్థండ్లు ఎవ్వలుండొద్దు. అత్త మామ సంపాయించిన ఆత్తంత తనే అనుభగించాలె అనుకుంటుండ్రు. లోకం గిట్ల పాడైంది. మీ వొదినె సుత నీ లెక్కనే అన్కుంటే నీ మంచాల బడ్డ మీ నాయిన ఏమయ్యేటోడో ఒక్క పాలి ఇశారం జెయ్యి విజ్జెమ్మా!.
గంతేనంటవా అవ్వా! మా అత్త మావ నన్ను మంచిగ జూస్కుంటరు.ఆడిబిడ్డైతే అక్క లెక్కనే...నిజమే అవ్వా! తప్పై పోయింది.
సరే తీ!విజ్జెమ్మా. అయిన గీ రోజుల్ల లగ్గం గాంగనే ఏరు కాప్రం బెడుతుండ్రు.అత్త మావ సుత ఏరుండేందుకే మొగ్గు సూపుతున్నరు.
"ఎందుకు తీ అవ్వా! "సచ్చిన పామునే మల్ల సంపుతవు.బుద్ధొచ్చింది. ఇంకోపాలి అస్సలు అనను" నారాజు పడ్కుంట తలొంచుకుని బయటికెళ్ళింది విజ్జెమ్మ.
గదండీ సంగతి."అత్త లేనమ్మ ఉత్తంరాలు. మావ లేనమ్మ మా బాగ్గెవంతురాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి