సుప్రభాత కవిత : - బృంద
సాగే ఉదయపు గాలికి 
ఊగే కొమ్మల నాట్యం 
తాకే వెచ్చని స్పర్శకు
రేగే కొత్త ఉత్సాహం

పొగమంచు తెరలమాటున
గగనాన దాగిన బింబముతో
అడ్డుగ నిలబడి ఆపుతూ
మబ్బులు పాడే సరాగాలు

దాచిన దాగని వెలుగులతో
చాచిన చేతుల స్వాగతమిచ్చే
వేచిన భువికి వేడుకగా
వచ్చెను మిత్రుడు పండుగగా!

రాతలు మార్చే కాలానికి 
మేతగా మారిన బ్రతుకులను
నేతలా ముందుండి నడిపే
ఊతగా నిలిచే  అనుగ్రహంగా

వల్లకాని బాధలను 
వెళ్లగొట్టి కాపాడి 
చల్లని చూపులతో 
రక్షించు దైవానికి...స్వాగతమంటూ

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు