ప్రకృతి: -డా ప్రతాప్ కౌటిళ్యా.
రైతు ఉద్యోగి కాదు 
జీతం ఇవ్వడానికి!?

రైతు ఒక సూర్యుడు 
కిందికి దిగి రాలేదు 
కానీ ఆదుకుంటాడు. 

రైతు ఒక మేఘం 
నేలను తాకడు 
కానీ నేలను తడుపుతాడు. 

రైతు ఒక ఉద్యోగి కాదు 
జీతం ఇవ్వడానికి 
రైతు ఒక వృత్తి కాదు 
రైతు ఒక ప్రకృతి..!!

రైతు ఒక మొక్క రైతు ఒక వృక్షం 
రైతు ఒక మహా వృక్షం. 

రైతు ఒక విత్తనం రైతు ఒక ఆకు 
రైతు ఒక కాయ రైతు ఒక ఫలం 
రైతు ఒక దాన్యం రైతు ఒక ధనం 
రైతు మనిషి కాదు ఒక దేవుడు.!!!

మనిషిది చెమట చుక్క కాదు 
కన్నీరు 
మనిషిది అన్నముద్ద కాదు 
ఒక మహాసముద్రం 
మనిషిది రుణం కాదు 
ఒక మహారణ్యం....!!
మనిషిది ఆకలి కాదు 
ఒక ఆకాశం 

దానికి సమాధానం
కూర కాయ పండు ధాన్యం 
అదే ధనం అదే రైతు.!!!?
రైతు వృత్తి కాదు రైతుఒక ప్రకృతి!!?.

నేడు జాతీయ రైతు దినోత్సవం. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు