అక్షరకిరణం: - యామిని కోళ్ళూరు
సాహితీ కెరటాలు 
===============
అందనంత ఎత్తులో ఉన్న వాటిని 
సాహితీ తరంగాలు ఆత్మకథ రాయగలదు
జోలపాటలతో ఆబాలగోపాలాన్ని మరపిస్తూ
వసంతం,,హేమంతవేళ ఆమని కోయిల 
గానాల ఆరాటం,,

ఆలోచనల వేళ ఓ నెచ్చెలిలా ఊతమై నిలుస్తూ 
నాకంతా సమానేమని అందరిని
కలుపుకొని,,, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ
లోకమంతా నాదేనని,,,గళమెత్తి గర్జించినా 
ఉగ్రవాదం ఆగడాలని,,అక్షరతూటాతో 
తిప్పికొడుతూ,,, ఎండగడుతూ..


పురివిప్పిన మయూఖంలా చైతన్యం నింపుతూ 
ముస్తాబై ఎప్పుడు సరికొత్తదనంతో 
ఎన్నో ప్రక్రియలతో పరిమళిస్తూ,,షడ్రుచుల 
కలబోతగా,, ఔన్నత్యాన్ని చాటుతూ,, జీవితానికి 
పున్నమి వెలుగులా వెలుగునిస్తూ,,ప్రేమికుల 
నడుమ రాయబారం తెలిపేవేళా సుగంధాల 
విరిజల్లులా..


జ్ఞాపకాలని గుర్తుచేస్తూ అల్లికతో పొగడ్తలకి
లొంగక పాఠక హృదయాలని ఆకట్టుకుంటూ
ఎందరో కవులు కవితాత్మకంగా రాసిన 
రచనల అక్షరమాలిక,,తెరచిన పుస్తకము కన్న 
మనసుపుస్తకంలో ఎప్పుడు సంచరిస్తూ 
సాహితవనాన్ని దేదీప్యమానంగా వెలుగులు
చిందించే అక్షరకిరణాలు..



కామెంట్‌లు