చదువుల గుడి మా బడి
విజ్ఞాన కాంతుల ఒడి
బడి అంటే మాకు ప్రాణం
బడే మాకు ధైర్యం
మా బడిలో ఉన్నారు మంచి విద్యార్థులు
వారే మా బడికి చిరు దివ్వెలు
గురువులు చెబుతారు మంచి పాఠాలు
వారే మాకు నిజ దైవాలు
మా బడి చాలా అందం
ఆ బడే మా బంధం
మా బడిలో ఉన్నాయి చాలా తరగతులు
అవే మా విజ్ఞాన విజయాల కాంతులు
మా బడి యొక్క లక్ష్యం
విద్యార్థుల విజయం
మానవత్వమే మా కర్తవ్యం
ఆ విలువలే మా భవితవ్యం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి