రాజ్యాన్ని వదిలిపెట్టాడు ఆ బుద్ధుడు
సమాజం చేయిపట్టాడు ఈ బుద్ధుడు
బుద్ధునివి రిక్త హస్తాల మస్తీస్కాలు
సహస్ర కలహాల సలహాలు ఈ బుద్ధుని వీ!!
పర్వతం ఐరావతంగా మారింది
అడవి హృదయంగా మారింది
ఆకాశం వికాసం కోసం ఆహ్వానించింది
పచ్చదనం కోసం
భూదేవి పచ్చ జెండా ఊపింది.!!
రాలిపోయిన చినుకులు
రాలిపోయిన కిరణాలు
రాలిపోయిన ఆకులు
కొత్త రుతువు కోసం వేచి ఉన్నాయి!!
ఇంద్రధనస్సు విరియాలీ
ఉరుములు మెరుపులు రావాలి
సూర్యచంద్రులు కిందికి దిగాలి
పేదలు కలలు కనాలి
బుద్ధుడు కళ్ళు తెరవాలి!!!
బుద్ధుని వెనక సమాజం ఉంది
బుద్ధుని ముందు సామ్రాజ్యం ఉంది
మధ్యలో నిజం ఉంది. నిజాయితీ నీ విజయం.!!
బుద్ధారం సర్పంచిగా గెలిచిన మిత్రుడు లయోలా డా .శేఖరయ్య గౌడ్ కు అభినందనలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి