కోరినప్పుడు వసంతం రాదు
దొరికిన ప్రతి క్షణము
వసంతంలా మార్చుకోవాలి!
ఆత్మీయులు ఆశించినపుడు
దొరకరు. దొరికినపుడు
అలక్ష్యం చేయక అందుకోవాలి!
అనుకున్నవి అందవు
అందినవాటిని ఆస్వాదించడం
అలవాటు చేసుకోవాలి!
తడవాలనుకున్నపుడు
వర్షం కురవదు
కురిసినపుడు కోరికతో
తడిసి ఆనందించాలి!
అనవసరంగా జోక్యం
కూడదు... అవసరమైనపుడు
మౌనం పనికిరాదు!
సూర్యోదయం చూడగలగడం
అదృష్టం.... అరుదైన
అవకాశంగా భావించి
ఆనందించాలి!
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి