అపుడే కనులు తెరచి
అవనికి అతిథిలా వచ్చి
ఆత్రంగా నీకై వేచి
ఆనందంగా నవ్వే పువ్వు!
చిన్ని జీవపు చిన్ని లోకం
చిందులు వేసే ఆనందం
చింతలు లేని జీవితం
చివరి వరకూ ఒకటే సంతోషం!
తనకోసమే నీవొచ్చావని
తనతోనే ఉంటావని
తలచి నవ్వే ప్రసూనపు
తలపు ఎంత మధురం!
నీహారికలతో స్నేహం
ప్రత్యూషంలో పరిమళం
నిత్యసంతోషపు రూపం
సత్యమైన జీవితార్థం!
ప్రతి క్షణం ప్రమోదం
ప్రసూన జీవన వేదం
ప్రతి మనసుకు తెలియాల్సిన
ప్రథమ పరమార్థం
పువ్వు వంటి మనసు కలిగి
నవ్వులన్నీ పరచి ఉంచి
దివ్వెలాగా వెలుగు పంచి
బ్రతకమనే సందేశం
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి