మిజోరం రాజధాని ఐజ్వాల్ .మిజో భాష ఆంగ్లం ముఖ్యంగా మాట్లాడుతారు.ఫిజియాంట్,హూలాక్ గిబ్బన్ రాష్ట్ర పక్షి,జంతువు.రెడ్ వాండా రాష్ట్ర పువ్వు.వందల ఏళ్ల కిందట మిజోజాతివారు వలసవచ్చారు. వారిని కుకిస్ అని పిల్చేవారు.కొండల్లో నివాసం ఏర్పర్చుకున్నవీరు అస్సాంలో భాగంగా ఉన్నారు.1987లో రాష్ట్రంగా అవతరించినది.ఎత్తైన పర్వతం బ్లూమౌంటెన్.వెదురు అరటి పైన్ చెట్లు విస్తారంగా ఉన్నాయి.బ్రిటిష్ వారి ఆధీనంలోకి రాకముందు 15 ఏళ్ల మగపిల్లలు జవల్బుక్ అనే డార్మిటరీలో ఉంటూ వేట కుస్తీ యుద్ధనైపుణ్యాలు నేర్చుకునేవారు. కఠిన క్రమశిక్షణ తో పెరిగేవారు.
ఇక మిజోరాండాన్సులు ఖుల్లం, చెరా వెదురుకర్ర లతో చేసే విన్యాసం వింతగా అద్భుతంగా ఉంటుంది.భార్య చనిపోతే భర్త *ఛాన్ గ్లేజన్ * అనే డాన్స్ చేస్తాడు.డాంపా టైగర్ రిజర్వ్ లో పెద్ద పులులు రకరకాల అడవిజంతువులకు ప్రసిద్ధి🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి