బాల్యంలో అమ్మ నడిగేను
మనింట్లో పాలయి పోయాయని
పార్వతత్తయ్యతో ఎందుకు చెప్పావు అంటే
నీవు మారవురా ఎన్నటికీ అన్నది జ్ఞాపకమే.
నాన్న సిగరెట్ హానికరమన్నారు
కాలుస్తున్నారని
తాతయ్యతో చెబితే దెబ్బలాడినపుడు
నాన్న అన్నది మరచిపోలేను
వీడు మారేదెప్పుడన్నది.
చిన్నప్పటి స్నేహితుడు అప్పుల్లో ఉంటే
సహాయం చేస్తే
భార్యన్నది మీరేన్నడు మారేదన్నది.
చదువుకుంటున్న పిల్లలకి సెల్ అస్తమానం పనికిరాదని చెబితే
కోడలన్నది సెల్ ఉపయోగం మంచిదే అడుకోనివ్వండి అని
కొడుకుతో ఈ పెద్దయాన మారేదెప్పుడని.
ఒరే రామం లంచం తీసుకు విలాసమైన జీవితం
గడిపే నువ్వు మన పాఠశాల పడిపోయే స్థితిలో ఉంది సహయంచేయరా అని
నా దగ్గర చదివి ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థి రామాన్ని అడిగితే
మాష్టారు మీకిస్తాను చదువు చెప్పినందుకు కానీ
పాఠశాలకెందుకు
మీరు ఏభై ఏళ్లయి అలానే ఉన్నారు
మారలేదన్న మాటవిని
మనసులో అనుకున్నా
ఈ జేవితంలో నే మారలేనేమో.
.........................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి