రామ్ విలాస్ వేదాంతి:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ -(పుష్యమి)-హైదరాబాద్.
ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుని
అయోధ్యలో చూడాలన్నదే నా ఆశయమని
జీవితాన ఆ కోరిక నెరవేరాలని మనసా వాచా కర్మణా కోరుకుని
రామాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి
రామచరిత్రను సాధారణ ప్రజలకు   అందించిన
సంస్కృత పండితుడు 
డాక్టర్ రామ్ విలాస్  దాస్ వేదాంతి.

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా
అయోధ్య రామజన్మ భూమి ట్రస్ట్  సభ్యునిగా
జీవితాంతం సన్యాసి వోలె జీవితం గడిపి
ఆశయం నెరవేరిన వేళ  అనుదినం రామచరిత్ర చెబుతు
మధ్యప్రదేశ్ రేవా లో రామాయణం చెప్పడానికివెళ్ళి
అస్వస్థతకు గురై తాను నమ్ముకున్న శ్రీరాముని దరిచేరిన పుణ్యశాలి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  స్వయంగా నివాళి అర్పించి
అయోధ్యలోనే తన వశిష్ఠ నివాస్ లో ప్రజల దర్శనం ఉంచి
తాను ఉద్యమించి సాధించిన రామజన్మభూమి 
అయోధ్యలో అంతిమ సంస్కారం పొందిన మహానీయులు
వారికివే నేనందిస్తున్న అక్షర నివాళి....!!
.............................


కామెంట్‌లు