వారి కోసమే...అండగా ! :- కోరాడ నరసింహా రావు.
అణు వంత అక్షరం న న్నే మిచేయగలదు...
  అనుకోకు , ఆటంబాంబై తన సత్తా చాటగలదు ! 

అహ్హా హా హా హ హా ...! అక్షరం అని వెటకారంగా నవ్వకు...! 
   ఆ అక్షరాలే ఈటెలై... నిన్ను నీ సమూహాన్ని ... 
  కూల్చేయ గలవు...! 

నువ్వెన్ని యుక్తులు, కుయుక్తులను ప్రయోగించినా... 
  ఈ అక్షరాస్త్ర,శస్త్రములు 
ఛేదించి విజయమును చే కూర్చగలవు...!! 

అక్షరం వాగ్రూపం చెందితే ఆ శబ్ధం బ్రహ్మస్త్రమే...! 

అక్షరానికున్న శ క్తి... 
  ఎన్ని ఉద్య మాలలో రుజువు కాలేదు...!
 ఎన్నెన్ని విజయాలకు
ఊతమివ్వలేదు...!! 

అక్షరమంటే... రాముని చేతిలో బాణ మోయ్...తిరుగుండదు..! 
  
 అక్షర మెప్పుడూ ధర్మ పక్ష పాతే...! 
  అధర్మం పాలిట మృత్యు వే...!! 
  అన్యా యాలకు అక్షరం యమ దండన...! 

అమాయకులు, అర్భకులు   వీళ్ల కెవరుదిక్కు,అనుకోకు
 అక్షరాలము మేమున్నాము...! 
   వారికోసమే, అండగా...!! 
    ******

కామెంట్‌లు