పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్కృతామ్
ధర్మ సంస్థా పనాదార్థాయ సంభవామి యుగే యుగే !
అన్నారు శ్రీకృష్ణ పరమాత్మలు వారు.
భావం:ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ఐశ్వర్యము, విజయము తప్పకుండా ఉంటాయి. అంటే కేవలం వారి చిత్రఠము పెట్టడం కాదు, భగవద్గీత చదివితే విజయము లభిస్తుంది అని అర్థము.💐💐
ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ఐశ్వర్యము, విజయము తప్పకుండా ఉంటాయి. అంటే కేవలం వారి చిత్రపఠము పెట్టడం కాదు, భగవద్గీత చదివితే విజయము లభిస్తుంది అని అర్థము.💐💐
భగవద్గీత ఎందుకు చదవాలి అని అడిగితే కృష్ణుడు అర్జునుడు చెప్పిన సమాధానం.
నీ దయవలన అనుమానాలు తొలగిపోయాయి. ఇప్పుడు సందేహాలని తొలగిపోయాయి, ఇప్పుడు కర్త్యనిష్టలో ఉన్నాను అన్నాడట.
ఇది అర్జునుడే కాదు , ప్రతి మనిషి పాటించాలి. ప్రతి ఊపిరి పీల్చే, ప్రాణులున్న, జంతు , కీటక మృగాలు, సర్వులు, అందరూ, గీత అదే భగవద్గీత వినాలి, అర్థం చేసుకున్న వాళ్ళు అద్భుతంగా బతకడం నేర్చుకుంటారు.
ఇదే దాని నుంచి ఉద్భవించిన , సంశయం,తొలగించ, స్వచ్ఛమైన నిజం ఆవిర్భవించింది. అది అతి సులభతరంగా నేర్చుకుని ఆచరించడానికి జనాలకు నిర్భయంగా ప్రక్షాళన చేసి చెప్పడమే గొప్ప విషయం.
అదే అచ్యుతుడు, నారాయణుడు, శ్రీకృష్ణుడు నేర్పించాడు మనకు.
దీన్ని బట్టి తెలిసినదేమిటంటే పదిమందికి చెప్పడం కాదు. జీవితంలో ఒక ముఖ్య భూమిక తీసుకోవాలి మన గీత మత గ్రంథం కాదు ముమ్మాటికి అని చెప్పాలి
మన భగవద్గీత మత గ్రంధం కాదు ఏ మనిషినైనా, తీర్చి దిద్ద గల నైతిక విలువలు ఉన్న ధర్మ గ్రంథం, అందుకే మనం గౌరవం ఇవ్వడమే కాదు ఎలా ఇవ్వాలో కూడా నేర్పగలం. ఈ భగవద్గీత ప్రతి ఒక్కరికి, ప్రజాదరణ పొందడం మర్యాదలు పాటించడం నేర్పిస్తుంది. అందరికీ ఆ గౌరవాన్ని సంతరించుకుని ప్రవర్తించడం నేర్పాలి ,మనం ప్రతి ఒక్కరికి. ఇందులో పిల్లలు దగ్గర్నుంచి ఆ పాటలు ఆ మాటలు విని ఆ భాషణలో తన్మయత్వం చెందుతే కలి ప్రభావం పారిపోతుంది
భగవంతుడిని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవచ్చు ఆత్మా, పరమాత్మ , సన్నిధానం అవుతుంది.
ఎప్పుడైతే మన ఆత్మ భగవంతునితో మమైకం అవుతుందో, చెడు అన్న ఆలోచన రాదు
ప్రక్షాళనమై పవిత్ర గంగాజలంతో పునీతమైన జీవిగా స్వచ్ఛత తో దైవ సన్నిధానం లో, దైవంతో ప్రత చర్యలో ,మునిగి అవగాహన జ్ఞానం సంపాదించుకుంటాం. అందునుండి వచ్చునది భగవంతుని వాక్ అవుతుంది.. జీవితం పునీతమవుతుంది. అందుకే గీత విని, మననం చేసి, ఆకలింపు చేసుకుని అద్భుతంగా భగవంతుని సన్నిధిలో గడుపుదాం.
"సర్వేజనా సుఖినోభవంతు".
*******
భగవద్గీత ఎందుకు చదవాలి : - కె.కె.తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి