దీపావళి పండుగ వచ్చింది
వెలుగులు ఎన్నో తెచ్చింది
నేను పొద్దున లేచాను
చక్కగా స్నానం చేశాను
దేవుని గుడికి వెళ్లాను
పూజలు ఎన్నో చేశాను
అమ్మ పాయసం వండింది
అందరూ కూర్చొని తిన్నాము
నాన్న బజారుకెళ్లాడు
డబ్బులు తీసుకువెళ్లాడు
టపాకాయలు తెచ్చాడు
మమ్ముల కాల్చామన్నాడు
టపాకాయలు అన్నిటినీ
దూరం దూరం పెట్టాము
అగరుబత్తితో కాల్చాము
ఢాం ఢాం అని పేలాయి
మాకు సంబుర మయ్యింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి