సాహితీ కవన క్షేత్రంలో వెలువడు...
త్రవ్వే కొలది ఎన్నో గుప్త నిధులు!
కాలానుగుణంగా పంటలు వేసినట్లే,
వాతావరణ అనుకూలత గమనించి,
జ్ఞానమనే విత్తులు నాటితే,
పంచభూతాత్మకంగా పరిణతి చెంది,
అంకురించి, పెరిగి, పెద్దయి భూరుహమై,
చూపించు భావ వల్లరిని మస్తకంలో!
ఆ భావ తరంగాలు కవితా రూపం దాల్చి,
జన బాహుళ్యాన్ని అలరించే కవితలై,
సాహితీ చిరుజల్లులు కురిపించు!
మధ్యలో బండరాళ్లు, కంకర అడ్డొచ్చినా,
పెకిలించి చేసుకో నీ మార్గం సుగమం!
పెనుగాలులు వీచినా చలించక,
విమర్శలను ఆశీస్సులుగా స్వీకరించి,
సాగిపో నిర్భయంగా నీ గమ్యం వైపు!
ఆనాడే నీవు అవుతావు మహాకవివి!
సాహితీ చిరుజల్లులే స్వాతి చినుకులై,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి