కీర్తి కండూతి :- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి)-హైదారాబాద్
శాంతి అహింసలే సాధనాలుగా స్వాతంత్ర్య సముపార్జన చేసారున్ జాతిపిత మహాత్ముడు.
అందరికి వసతి ఉండాలని భూదానోద్యమాన్ని చేసి పేదలకు వసతి కల్పించారు ఆచార్య వినోబాబావే.

ఆనాడు తండ్రి మాట జవదాటక కాననలకేగిన శ్రీరామచంద్రుడు.
ఆడినమాట తప్పక భార్యాపిల్లడిని కూడా అమ్మి
చక్రవర్తి నుంచి కాటికాపరిగా మారిన హరిశ్చంద్రుడు.
ఎందరో మరెందరో మహానుభావులు అష్టకష్టాలు పడి కర్తవ్యాన్ని నెరవేర్చి
కీర్తిప్రతిష్ఠలు పొంది నేటికి  చిరస్మరణీయులు.

నేడు కర్తవ్యాన్ని కుటుంబ బాధ్యతను మరచి
కీర్తి కోసం నిజానికి వారు అర్హులా కారా అన్నది మరచి
బిరుదులు, పురస్కారాలు కొనుక్కోవడం
తాహతుకు మించి సమాజ దృష్టిలో పడాలని
ధనాన్ని ఖర్చు బెట్టడం
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని మరచి
మాయపూరిత పొగడ్తలకు లొంగి దానం చేసి
చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితులు
అందుకే "అతి సర్వత్ర వర్జయేత్" గా ఉండి
చిన్నయసూరి చెప్పినట్లు
తనకు మాలిన ధర్మం
మొదలు చెడ్డ బేరం అన్న సామెత మరువక
కీర్తికోసం వెంపర్లాడక
మానవత్వమే మాధవత్వముగా  జీవించిన వారి జీవితం సాఫల్యమే...!!
.........................


కామెంట్‌లు