ఏమిటీ మతోన్మాద హింసాత్మక ప్రవృత్తి?:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.
నేడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న 
మైనారిటీలపై జరిగే హింసాత్మక చర్యలు
మానవత్వానికే కళంకం తెచ్చేపరిస్థితి.

సహనానికి, ఓర్పుకి ప్రేమతత్వానికి ప్రతీకగా నిలిచే
హిందువులపై జరిగే మారణహోమం
పవిత్ర దేవాలయాల కూల్చివేత
మానభంగ,హత్యలు  గత రెండు సంవత్సరాలయి
జరుగుతున్న సంఘటనలు.

దీపు చంద్రదాస్ అనే హిందు యువకుని కొట్టి చంపి దహనం చేయడం
క్రూరత్వానికి పరాకాష్ట
బంగ్లాదేశ్ విమోచన కోసం
ఏబది సంవత్సరాల పూర్వం
భారతీయులంతా ఏకమై పాటుపడ్డారని గుర్తులేదా
ప్రపంచ దేశాలన్ని ముక్త కంఠం తో వ్యతిరేకిస్తున్నారు.

శాంతి సహనం కొంతవరకే శివాజీ మహరాజ్ ,రాణా ప్రతాప్  వారసులమని మరవకు
దేశ రక్షణ, ప్రజా పరిరక్షణ కర్తవ్యమని పాలించే ప్రభుత్వం, దేశప్రజలు 
ఈ హింసాత్మక సంఘటనలకు బదులు చెప్పే రోజు రానీయకు
వసుదైక కుటుంబమన్నది
మరువక  
"అహింసా పరమో ధర్మః"
అన్నది పాటించి
మానవత్వాన్ని మరవకు!!.

(సుమారు రెండు సంవత్సరాలయి బంగ్లాదేశ్ హింసాత్మక  సంఘటనలు చూస్తు నిన్న ఎంతో భవిష్యత్ గల దీపు చంద దాస్ అనే యువకుని అతిఘోరంగా హత్యచేసి దహనం చేసిన విషయం విని ఆర్ద్రత తో వ్రాసినది)
...............................


కామెంట్‌లు