సామెత-94: అమర్చిన దాని మీద అమ్మగారు చెయ్యేసినట్టు
****
"అవ్వా! మన కొమరమ్మొదిన మస్తు ఉషారు పిట్టలే. గా వొదినకున్న తెల్వి నీకు లేదు నాకు సుత లేదు. నువ్వైతే పండక్కో, పబోజనాలకు ఎల్లినప్పుడు, ఎప్పుడు జూశినా వొంటల్ల గంటె కలబెట్కుంటనో, బోళ్ళు బొచ్చెలు తోముకుంట కుత్తీ బడుతూనో కనిపిత్తవు.
మొన్న ఎట్లొచ్చిందో సూశినవ్ గద! పెటపెటలాడే శీరగట్కొని మెళ్ళ ధగధగమనే నగలేస్కుని మస్తు చెమ్కాయించుకుంట అగుపిచ్చింది. శీర కుచ్చిళ్ళు, కొంగు శెరగనీయకుండా త్యాప త్యాపకి సవరిచ్చుకుంటా పేద్ద ఆపీసరు పెళ్ళాం లెక్క ఎంత ఇస్టైలు జేసిందో?"
"నువ్వేమో పొయ్యికాడ అప్పడాలేస్కుంట ఉన్నవు. షోకులు జేస్కోని వొచ్చుడే తలొక్క శెయ్యి ఎయ్యొద్దా అని గద్మాయిత్తే గప్పుడు ఒక్కొక్కరు లేశి పని చెయ్య బట్టిండ్రు.
"ఇంగ మన కొమరమ్మొదిన్ని జూశినవ్ గద, ఆమె యవ్వారం మామూల్గ లేదవ్వా! శెమటలు కారిపోయేటటట్టు మనందరం కట్టపడి చేశిన మొగోళ్ళు వొంట ఎక్కడి దనుక వొచ్చిందని సూడనీకి వొచ్చేతల్కి గక్కడ వొదిన గిన్నెల మూతలు తీసి సూసుడు,పెట్టుడు,ఏందేందో మస్తు కట్టబడ్తూ సవరిచ్చినట్టు సూసుడు".
"గజ్జూసి,ఎంకయ్య తాత యివురమంటె కొమురమ్మొదినదేనని యమ మెచ్చుకొనుడు.
వొంటి మీద బట్ట నల్గకుంట పనులు జేసుడు కొమురమ్మదిన్ని జూసి మీరంత నేర్సుకొమ్మని తాత ఒకటే ఆగకుంట జెప్పుడు. గస్మంటప్పుడైన గిదంత జేసింది నేను గాదని శెప్పలేదవ్వా!"
" కొంతమంద్రి గట్లనే ఉంటరు శెల్లె "అన్ని అమర్చిన దాని మీద అమ్మగారు శెయ్యేశినట్టు"కట్టమొకర్ది మేర్వానం మరొకర్ది అన్నట్టు ఉంటరు. 'ఎవలి మన్సుకు ఆళ్ళకే దెల్వాలె 'మనమైతె ఒళ్ళు దాసుకోము. ఎవలన్న ఏదన్న శెప్పడం పాపం దాన్ని కొసెల్ల బాద్దెత మీద ఏస్కొని చేత్తం."
అనంగనే" నువ్వన్నది సత్తెం అవ్వా! ఇంగ నే బోతున్నవ్వా! ఎందుకో గీ ముచ్చెట మన్సుల యాదికొచ్చింది.గజ్జెప్పడాన్కి వొచ్చిన అన్కుంట ఇంటి దారి బట్టింది మునెమ్మ.
గదండీ సంగతి!" అన్ని అమర్శినంక అమ్మ గారు చెయ్యేశినట్టు " ఆంటె గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి