మేధావి నోటి మాటైనా...
సామాన్యుడి సూచనైనా...
మన ప్రయాణానికి వెలుగు పంచేదే.
కానీ చివరి అడుగు మాత్రం
మన హృదయం తీసుకున్న
ఒక "నిప్పులాంటి నిర్ణయమే"…
అదే మన "నడకకు నిచ్చెన"...
నిర్ణయాలు తప్పినా
నిందలు మోపరాదు ఎవరిపైనా
సత్ఫలితాలైనా...దుష్ఫలితాలైనా
మన "చేతలతో చల్లిన విత్తనాలే"...
గట్టిపట్టుదల...
కఠోర సాధన...
కసి కృషి, క్రమశిక్షణ...
ఇవే "మన గమ్యానికి రథచక్రాలు".
ఏ చిన్న కార్యక్రమమైనా
బండిలా ముందుకు సాగాలంటే…?
గమ్యం చేరాలంటే...?
"చక్కని ఫలితాలు దక్కాలంటే"..?
"సలహాలే చక్రాలు"...మంచి
"నిర్ణయాలే దూసుకుపోయే గుర్రాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి