ఆశల జ్యోతులు ఆరిపోకుండా
ఆరాటపు పోరాటం ఆగిపోకుండా
వెతలను వెదికి వెదికి వెలివేసే
వేకువకు వేవేల వందనాలు!
గాయమైన హృదయానికి
మాయని సౌఖ్యమిచ్చేలా
మౌనమైన మనసులోన
రాగమేదో పలికింపచేసే....
దారికానని చీకటిలో
దూరాన కనిపించి
గుండె బరువు దించేలా
మినుకుమన్న వెలుగిచ్చే
మదిని వీడని మమతల
నిధిని దాచి గుంభనగా
తలపోసి తపియించే
తలపులకు ఊతమిచ్చే..
వడలి వాలిన తీవకు
వాటంగా ఆసరా ఏదో
వేడుకోక మునుపే
వద్దకొచ్చి ఓదార్చే...
వెలిగే చిక్కటి కిరణాలతో
కరిగే చీకటి కోణాలకు
కదిలే కాలం సాక్ష్యంగా
కలలు తీర్చే వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి